Naga Chaitanya: ప్రేమించడం నేర్పించావు.. థ్యాంక్యూ హాష్: చై ఎమోషనల్ పోస్ట్

Naga Chaitanya: ప్రేమించడం నేర్పించావు.. థ్యాంక్యూ హాష్: చై ఎమోషనల్ పోస్ట్
Naga Chaitanya: నటుడు నాగచైతన్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడు.. చాలా తక్కువగా పోస్టులు పెడుతుంటాడు.. ప్రస్తుతం తాను నటించిన థ్యాంక్యూ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా పోస్ట్ పెట్టాడు..

Naga Chaitanya: నటుడు నాగచైతన్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడు.. చాలా తక్కువగా పోస్టులు పెడుతుంటాడు.. ప్రస్తుతం తాను నటించిన థ్యాంక్యూ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా పోస్ట్ పెట్టాడు.. అది చూసి చై ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తన జీవితంలో థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తులు కొందరు ఉన్నారని, వాళ్లకి స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టాడు.

నాగ చైతన్య తన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు.

అత్యంత ముఖ్యమైన ముగ్గురు వ్యక్తులను గురించి అతడు రాసిన సందేశం చదివి అభిమానుల కళ్లు చెమర్చాయి. నాగ చైతన్య పోస్ట్ సారాంశం ఇలా ఉంది, "థ్యాంక్స్ – నేను చాలా తరచుగా ఉపయోగించే పదం, ఇది చాలా ముఖ్యమైన చోట ఉపయోగించాల్సిన పదం.

"నేను ఈ పోస్ట్‌ను నాకు చాలా ముఖ్యమైన వ్యక్తులకు అంకితం చేస్తున్నాను .. వారికి కృతజ్ఞతలు చెప్పడం ఎప్పటికీ సరిపోదు .. మీకు అదే విధంగా మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తుల చిత్రాలను పంచుకోవడం మీ అందరికీ ఇష్టం .. ట్యాగ్ చేయండి #themagicwordisthankyouతో కలిసి రండి!" మీరు కూడా మీ జీవితంలో కృతజ్ఞతలు తెలపాల్సిన వ్యక్తుల గురించి పంచుకోండి అని తెలిపాడు నాగ చైతన్య.


అతను తన తల్లి లక్ష్మి దగ్గుబాటితో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నాడు. తన ఎదుగుదలకు కారణమైన తల్లికి ధన్యవాదాలు తెలిపాడు. "అమ్మా - నా కోర్‌గా, ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ, నా వెన్నంటే ఉన్నందుకు థ్యాంక్స్ అని తల్లికి కృతజ్ఞతలు తెలిపాడు. మరొకరికి నా థ్యాంక్స్ అంటూ.. "నాన్న – నాకు దిశానిర్దేశం చేసినందుకు, మరే ఇతర స్నేహితుడికి లేని స్నేహితుడి లాంటి తండ్రి ఉన్నందుకు" నాన్న నాగార్జునకు కృతజ్ఞతలు అని ఆయనతో చిన్నప్పుడు కలిసి దిగిన చిత్రాన్ని పంచుకున్నారు. తండ్రి తన బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు ధన్యవాదాలు తెలిపారు.

చివరగా, అతను హాష్ (పెంపుడు శునకం) కు కృతజ్ఞతలు తెలిపాడు. ఎలా ప్రేమించాలో చూపించినందుకు మరియు తనని మనిషిగా ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపాడు. సమంతతో కలిసి ఉన్నప్పుడు దత్తత తీసుకున్న పెట్. దానితో తన అనుబంధం అనిర్వచనీయం అని పేర్కొన్నాడు.. హాష్‌కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు చైతన్య.

కాగా, చైతన్య, రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికాగోర్ ప్రధాన పాత్రలుగా నటించిన థ్యాంక్స్ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. జులై 8 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చై, సామ్ కలిసి పెంచుకున్న హాష్ డాగ్.. ప్రస్తుతం సమంత దగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో చైతన్య పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

Tags

Read MoreRead Less
Next Story