Naga Shaurya : భళా.. నాగశౌర్య పెళ్లి భోజనం అదిరింది బాస్..

Naga Shaurya : భళా.. నాగశౌర్య పెళ్లి భోజనం అదిరింది బాస్..
Naga Shaurya : పెళ్లి ఎలా చేసుకున్నా భోజనం బ్రహ్మాండంగా ఉండాలి. అదే అతిధుల్ని అత్యంత సంతృప్తి పరుస్తుంది.

Naga Shaurya: పెళ్లి ఎలా చేసుకున్నా భోజనం బ్రహ్మాండంగా ఉండాలి. అదే అతిధుల్ని అత్యంత సంతృప్తి పరుస్తుంది. వారి గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. వివాహ విందు కోసం పెళ్లివారు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు.



ప్రస్తుతం టాలీవుడ్ హీరో నాగశౌర్య పెళ్లి భోజనం గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రేమించిన అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు నాగశౌర్య. నవంబర్ 20న బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని వివాహం చేసుకున్నారు శౌర్య.



ఈ వివాహ వేడుకలకు సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. బెంగళూరుకు చెందిన ఓ ఫైవ్ స్టా్ర్ హోటల్‌లో వీరి వివాహం జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.



ఇక పెళ్లి వేడుకల్లో ఏర్పాటు చేసిన విందు భోజనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెళ్లికి వచ్చిన అతిధులందరికీ రాచరికపు భోజనం పెట్టి అతిధులందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయ బద్దంగా ఏర్పాటు చేసిన ఈ విందు భోజనంలో 12 రకాల వంటలు, 4 రకాల స్వీట్స్ వడ్డించినట్లు తెలుస్తోంది. కాగా టాలీవుడ్ సెలబ్రెటీల కోసం నాగశౌర్య హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story