Nagababu Resignation: నాకు వారి భవిష్యత్తును చూస్తే భయమేస్తోంది: నాగబాబు
nagababu (tv5news.in)
Nagababu Resignation: మా ఎన్నికల తర్వాత అసోసియేషన్ నుండి ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. ముందుగా మా నుండి నాగబాబు తప్పుకున్నారు. ఆ తర్వాత ప్రకాశ్ రాజ్ కూడా తాను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇటీవల శివాజీ రాజా కూడా తాను ఇంక మా లో భాగం కాదని స్పష్టం చేసారు. ఇదిలా ఉండగా తాజాగా మా కు నాగబాబు పంపిన రాజీనామా లేఖ వైరల్‌గా మారింది.
'ఏ వ్యత్యాసం లేకుండా అసోసియేషన్‌లో అందరం ఒక్కటిగా ఉండాలి అని నమ్మేవారిలో నేను కూడా ఒకడిని. అందుకే ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారిని 'మా'లో కలిపేసుకొని వారికి 'మా' అనే మరో ఇంటిని అందించాం. ఒకప్పుడు మా కు నేను అధ్యక్షుడిగా పోటీ చేయడానికి ఇదే ముఖ్య కారణం. కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లోని సభ్యుల్లో వచ్చిన మార్పులు నన్ను ఆశ్చర్యానికి గురిచేసాయి'.
'మాలో ఎంత పక్షపాతం ఉందో తెలుసుకోవడానికి ఎంతోమందికి ఈ ఎలక్షన్స్ సహాయపడ్డాయి. బలం, ధనం అనే ఉచ్చులో కూరుకుపోయి మా సభ్యులు ప్రాంతాల తేడాను చూపించడం మొదలుపెట్టారు. వీటి వల్ల ఇలాంటి అసోసియేషన్ నుండి వెళ్లడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. ప్రాంతం, మతం అని వారి గోతులు వారే తవ్వుకుంటున్న ఈ అసోసియేషన్‌కు నేను గుడ్ బై చెప్తున్నాను.'
'ప్రకాశ్ రాజ్ లాంటి గొప్ప వ్యక్తులకు తోడుగా నేను ఎప్పుడు నిలబడతాను. ఆయన దేనికి అండగా నిలబడినా, దేనికోసం పోరాడినా.. అందులో ఆయనకు తోడుగా నేను ఉంటాను. గతంలో జరిగిన వాటికి నేను విచారించట్లేదు. కానీ భవిష్యత్తులో మా ఎలా ఉంటుందో అని భయపడుతున్నాను. అందుకే ఇప్పుడే దీని నుండి తప్పుకుంటున్నాను. అందరికీ గుడ్ బై' అని నాగబాబు తన లెటర్‌లో చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com