Nagababu: మా కొత్త అధ్యక్షుడు విష్ణుకు నాగబాబు మెగా పంచ్..

Nagababu: మా కొత్త అధ్యక్షుడు విష్ణుకు నాగబాబు మెగా పంచ్..
Nagababu: మా ఎన్నికలు ఊహించని రీతిలో ముగిసాయి. ఎవరు గెలుస్తారా అన్న మిస్టరీ ఫైనల్‌గా వీడింది.

Nagababu: మా ఎన్నికలు ఊహించని రీతిలో ముగిసాయి. ఎవరు గెలుస్తారా అన్న మిస్టరీ ఫైనల్‌గా వీడింది. ఇందులో విజయం సాధించిన వారి వెనుక కారణమేంటి, ఓడిపోయిన వారి ఓటమికి కారణాలేంటి అని అప్పుడే కొందరు ప్రముఖులు విశ్లేషణ మొదలుపెట్టారు. అయితే కారణం ఏదైనా మరో రెండేళ్లు 'మా'కు అధ్యక్షతన వహించేది మంచు విష్ణునే. అయితే ఈ పరిణామం నచ్చక మెగా బ్రదర్ నాగబాబు మాకు రాజీనామా చేశారు.

నాగబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్న ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల్లో ఓడిపోయారు. దీనికి లోకల్, నాన్ లోకల్ గొడవే ముఖ్య కారణమని నాగబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం తనకు ఇష్టం లేదంటూ నాగబాబు మా నుండి బయటకు వచ్చేసారు.

ఇప్పటివరకు మా ఎన్నికల వల్ల జరిగిన కాంట్రవర్సీలలో ప్రస్తుతం నాగబాబు రాజీనామా కూడా యాడ్ అయ్యింది. ఆయన ఏ ప్రలోభాలకు లోనవ్వకుండా, చిత్తశుద్ధితో ఈ నిర్ణయం తీసుకుంటున్నానంటూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags

Next Story