నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ ఇవాళే

నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ ఇవాళే
X

లేదు లేదంటూనే అన్నంత పనీ చేసిందీ జంట. సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్నాడు. బట్ కొన్ని రోజులుగా నటి శోభిత ధూళిపాలతో కొత్త ప్రేమ స్టార్ట్ అయిందనీ.. ఈ ఇద్దరూ కలిసి వెకేషన్స్ కు కూడా వెళుతున్నారు అనే రూమర్స్ వచ్చాయి. ఇవన్నీ రూమర్స్ అని ఎవరూ ఖండించలేదు. కట్ చేస్తే కొన్ని రోజులుగా అంతా సైలెంట్ గా ఉంది. ఈ టమ్ లో సడెన్ గా షాక్ ఇస్తూ ఏకంగా ఎంగేజ్మెంట్ అంటూ న్యూస్ రావడం టాలీవుడ్ కు షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

శోభిత తెలుగు అమ్మాయే. సొంత ఊరు తెనాలి. 2013లో మిస్ ఇండియా ఎర్ట్ తో పాటు అదే యేడాది ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్. తర్వాత అనురాగ్ కశ్యప్ 2016లో రమణ్ రాఘవ్ అనే మూవీతో తనను బాలీవుడ్ కు పరిచయం చేశాడు. అప్పటి నుంచి సెలెక్టివ్ గా మూవీస్ చేస్తూ ఆకట్టుకుంటోంది. 2018లో అడవి శేష్ గూఢచారితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. గూఢచారి తర్వాత తెలుగులో తను చేసిన సినిమా మేజర్ మాత్రమే. ఎక్కవుగా బాలీవుడ్ కే ప్రాధాన్యం ఇస్తోంది. ఈసెంట్ గా వచ్చిన మంకీమేన్ తో హాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. అంతకు ముందు తమిళ్ లో పొన్నియన్ సెల్వన్ లాంటి హిస్టారికల్ మూవీలో కీలక పాత్ర చేసింది.

శోభిత, నాగ చైతన్య మధ్య ఎఫైర్ ఎప్పుడు స్టార్ట్ అయిందని కచ్చితంగా చెప్పలేం కానీ.. ఎప్పుడైతే రూమర్ వచ్చిందో అప్పటి నుంచి వీళ్లు మరింత జాగ్రత్తగా ఉన్నారు. అప్పుడప్పుడూ విదేశాల్లో ఒకే లొకేషన్ లోనో, కాఫీ షాప్ లో కనిపించడం ఆ ఫోటోస్ రావడం మళ్లీ న్యూస్ రావడం.. అంతే. బట్ ఇలా పెళ్లి వరకూ వస్తుందని ఎవరూ అనుకోలేదు. అందుకే చాలామంది సర్ ప్రైజ్ అవుతున్నారు.

ఇక ఈ రోజు నాగ చైతన్య ఇంట్లోనే ఎంగేజ్మెంట్ జరగబోతోంది. సో.. పెళ్లి తేదీకి సంబంధించిన వార్త కూడా ఈ రోజే వస్తుందేమో చూడాలి.

Tags

Next Story