ఆ దర్శకుడి కోసం మూడు నెలలు వెయిట్ చేసిన నాగ్.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్..!

ఆ దర్శకుడి కోసం మూడు నెలలు వెయిట్ చేసిన నాగ్.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్..!
కొత్త టాలెంట్‌‌ని ఎంకరేజ్ చేసేందుకు ఎప్పుడు ముందుంటారు కింగ్ నాగార్జున.. అందుకు పెద్ద ఉదాహరణ 'శివ' సినిమానే..

కొత్త టాలెంట్‌‌ని ఎంకరేజ్ చేసేందుకు ఎప్పుడు ముందుంటారు కింగ్ నాగార్జున.. అందుకు పెద్ద ఉదాహరణ 'శివ' సినిమానే.. ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ టాలీవుడ్‌‌కి పరిచయమయ్యాడు. అలా నాగ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకులలంతా స్టార్ డైరెక్టర్ లుగా ఉన్నారు. అందులో దశరథ్ ఒకరు.

దుర్గ ఆర్ట్స్ పతాకంపై పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు పి.ఎల్.నారాయణ, ఎస్ గోపాలరెడ్డి.. వారి వద్ద అక్కినేని నాగార్జున డేట్స్ ఉన్నాయి, కానీ కథే లేదు. చాలామంది రచయితలు కథలు చెప్తున్నారు కానీ ఏదీ నచ్చక ఫైనలైజ్ కాలేదు. దీనితో అప్పటికి తేజ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దశరథ్ దగ్గర మంచి కథ ఉంది. ఆ కథని విన్న పి.ఎల్.నారాయణ, ఎస్ గోపాలరెడ్డిలకి బాగా నచ్చింది. ఇదే కథను నాగార్జునకి వెళ్లి వినిపిస్తే బాగుందని అన్నారు. కానీ అప్పటికే షాజీ కైలాశ్ దర్శకత్వంలో శ్రీరాం అనే యాక్షన్ సినిమాలో చేసేందుకు అంగీకరించారు. మళ్ళీ యాక్షన్ మూవీ చేసేందుకు ఇష్టపడలేదు.

ఏదైనా కుటుంబకథ, ప్రేమకథ లాంటివి చెప్పమన్నారు నాగ్... రైటర్ గోపీమోహన్ తో కలిసి వారంరోజుల్లో లవ్, ఫ్యామిలీ ఎమోషన్ తో కూడిన కథను పూర్తిచేశారు దశరథ్. అదే సంతోషం.. ఈ కథ నాగార్జునకి బాగా నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారు. చివరకి సినిమా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ పూర్తయ్యాకా దాన్ని నాగార్జునకు వినిపించారు. కథ కుడా నచ్చింది. కానీ దశరథ్ నే డైరెక్ట్ చేయమని అన్నారు నాగ్..

స్క్రిప్ట్ వరకూ నేను ఇస్తాను, దర్శకత్వం వేరేవాళ్ళతో చేయించుకోండని చెప్పేశారు దశరథ్ . కానీ నాగార్జున మాత్రం దశరథ్ నే దర్శకునిగా ఉండాలని ఫైనల్ చేశారు. అయితే తనకు ధైర్యం చాలట్లేదని, ఆగస్టు 2001లో కాకుండా నవంబరు నెలవరకూ సినిమా షూటింగ్ ఆపితే తాను ఈలోగా సిద్ధమవుతానని చెప్పారు. స్క్రిప్ట్ నచ్చడం, దర్శకుడిగా దశరథ్ అయితేనే కరెక్ట్ అన్న నిర్ణయానికి నాగార్జున రావడంతో అందుకు అంగీకరించారు. అలా మూడు నెలలు మరో సినిమా చేయకుండా, మేకప్ వేసుకోకుండా ఇంట్లోనే కూర్చున్నారు నాగ్.. 2001 నవంబరులో ప్రారంభమైన ఈ సినిమాకి సంతోషం అన్న టైటిల్ ని గోపీమోహన్ పెట్టారు.

బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా హిట్ అయిన ఈ సినిమా నాగార్జునకి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. అంతేకాకుండా ఉత్తమ నటుడిగా నాగార్జునకి నంది అవార్డు, ఉత్తమ చిత్రంగా ఫిలిం ఫేర్ అవార్డులు లభించాయి.

Tags

Read MoreRead Less
Next Story