Nagarjuna Siva : శివ రీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నాగార్జున

Nagarjuna Siva :  శివ రీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నాగార్జున
X

తెలుగు సినిమా గమనాన్ని మార్చిన చిత్రం శివ. రామ్ గోపాల్ వర్మ డెబ్యూ మూవీగా వచ్చిన శివ టాలీవుడ్ ప్రస్థానాన్నే మార్చేసింది. అప్పటి వరకూ ఉన్న మూస ధోరణులను దాటుకుని స్టోరీ టెల్లింగ్ లోనూ, టెక్నికల్ గానూ, స్క్రీన్ ప్లే పరంగానూ సరికొత్త అనుభూతి పంచింది. ఈ మూవీ తర్వాత చాలామంది యువత దర్శకత్వం చేయాలని కలలు కన్నారు. అప్పటి వరకూ సినిమాల్లో నటులుగా రాణించాలనుకున్న వారు కూడా దర్శకత్వం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. శివ తర్వాత అర్జున్ రెడ్డి పాథ్ బ్రేకింగ్ మూవీ అనిపించుకుంది.

ఇక కొన్నాళ్లుగా ఇలాంటి ఓల్డ్ క్లాసిక్స్ ను రీ రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున నటించిన సినిమాలు కూడా కొన్ని రీ రిలీజ్ అయ్యాయి. బట్ అటు వర్మ ఫ్యాన్స్ తో పాటు ఇటు కింగ్ ఫ్యాన్స్ కూడా శివ రీ రిలీజ్ చేస్తే చూడాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారి కోసం శివ రీ రిలీజ్ డేట్ ను తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు బర్త్ డే సందర్భంగా ప్రకటించాడు నాగార్జున.

శివ చిత్రాన్ని నవంబర్ 14న రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా 4 కే లోకి అప్డేట్ చేసి మళ్లీ విడుదల చేస్తున్నారు. అంటే క్వాలిటీ పరంగా శివ ఇప్పుడు ది బెస్ట్ గా ఉండబోతోందన్నమాట. మరి ఈ రీ రిలీజ్ కు ఎలాంటి హైప్, కలెక్షన్స్ వస్తాయో చూడాలి.

Tags

Next Story