సినిమా

Bangarraju Twitter Review: వాసివాడి తస్సాదియ్యా.. బంగార్రాజు అదరగొట్టాడుగా.. ట్విట్టర్ రివ్యూ

Bangarraju Twitter Review: ఇక బంగార్రాజుతో పోటీ పడేందుకు ఒక్క సినిమా కూడా లేనందున ఈ సంక్రాంతి వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇదే అని చెప్పుకోవాలి

Bangarraju Twitter Review: వాసివాడి తస్సాదియ్యా.. బంగార్రాజు అదరగొట్టాడుగా.. ట్విట్టర్ రివ్యూ
X

Bangarraju Twitter Review: సంక్రాంతి పండగ అంతా తమదే అని బంగార్రాజు బలంగా నమ్మాడు.. ఆయన నమ్మకం వమ్ము కాలేదు.. ఇప్పటికే సినిమా చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు సినిమా బావుందని ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. శుక్రవారం (జనవరి 14) థియేటర్లలోకి వచ్చిన బంగార్రాజు తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాడు.

సంక్రాంతి సంబరాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో నాగార్జునకి ఉన్న క్రేజ్ కారణంగా సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. ఇక బంగార్రాజుతో పోటీ పడేందుకు ఒక్క సినిమా కూడా లేనందున ఈ సంక్రాంతి వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇదే అని చెప్పుకోవాలి.

2014లో వచ్చిన మనం చిత్రం తర్వాత నాగచైతన్య, నాగార్జున కలిసి నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకులు చాలా అంచనాలే పెట్టుకున్నారు. 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్ ఇది. రమ్యక‌ృష్ణ, నాగార్జున కాంబినేషన్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది.

అలాగే బ్యూటీ క్వీన్ కృతిశెట్టి, నాగచైతన్య మధ్య కెమిస్ట్రీ బాగుందంటున్నారు ప్రేక్షకులు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన 'లడ్డుందా', 'నా కోసం', 'బంగార' 'వాసివాడి తస్సదియ్యా' సహా నాలుగు పాటలు ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్నాయి.

ఇంకా ఈ చిత్రంలో రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, రోహిణి, ప్రవీణ్, అనిత చౌదరి, గోవింద్ పద్మసూర్య, రంజిత్, నాగబాబు, దువ్వాసి మోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Next Story

RELATED STORIES