Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కోసం నాగార్జున పారితోషికం ఎంతంటే..

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతూ వస్తోంది. అందుకే కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చేస్తోంది యాజమాన్యం. అందులో భాగంగానే ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభమయ్యింది. అయితే ఈ బిగ్ బాస్ ఓటీటీకి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. అయితే దీనికోసం కూడా నాగార్జున పారితోషికం భారీగానే ఉందని టాక్.
బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికి 5 సీజన్లను పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ మొదటి సీజన్‌కు ఎన్‌టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత సీజన్‌కు నాని హోస్ట్‌గా ఉన్నాడు. ఇక మూడవ సీజన్ నుండి పూర్తిగా నాగార్జుననే బిగ్ బాస్ హోస్ట్ ప్లేస్‌ను టేక్ ఓవర్ చేసేసుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ తెలుగు మొదటి సీజన్‌కు కూడా నాగార్జుననే హోస్ట్.
అయితే బిగ్ బాస్ ఒక్కొక్క సీజన్ కోసం నాగార్జున ఒక్కొక్క రెమ్యునరేషన్‌ను ఛార్జ్ చేశాడు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కోసం నాగార్జున రూ.6 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నట్టు సమాచారం. ఇక బిగ్ బాస్ సీజన్ 5 కోసం నాగార్జున.. రూ. 7 నుండి 8 కోట్లు ఛార్జ్ చేసినట్టు టాక్. ఇక ఇటీవల మొదలైన బిగ్ బాస్ ఓటీటీ సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com