Brahmanandam : అందుకే 'బంగార్రాజు'లో బ్రహ్మానందాన్ని తీసుకోలేదు : నాగార్జున

Brahmanandam : అందుకే బంగార్రాజులో బ్రహ్మానందాన్ని తీసుకోలేదు : నాగార్జున
Brahmanandam : అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ బంగార్రాజు.. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి ఇది సీక్వెల్.

Brahmanandam : అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ బంగార్రాజు.. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి ఇది సీక్వెల్... కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి.

సంక్రాంతి పండక్కి రిలీజైన ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి హిట్ టాక్ సొంతం చేసుకుకోవడంతో అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది బంగార్రాజు. ఇదిలావుండగా సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో నటించిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం దాని సీక్వెల్ బంగార్రాజు మూవీలో కనిపించలేదు. ఇది ఆయన అభిమానులను కాస్త నిరాశపరిచింది.

అయితే దీనిపైన మూవీ ప్రమోషన్ లో భాగంగా క్లారిటీ ఇచ్చారు నాగార్జున. సోగ్గాడే చిన్నినాయనా కథ జరిగిన ముప్పై సంవత్సరాల తర్వాత కథగా బంగార్రాజు చిత్రాన్ని చూపించామని అన్నారు. ఇది తాత, మనవడి కథ.. ముప్పై ఏళ్ల తర్వాత జరిగే కథలో బ్రహ్మానందంని చూపిస్తే ఓ 80 ఏళ్ల వయసున్న వ్యక్తిగా చూపించాల్సి వస్తుంది.. అదో పెద్ద స్టోరీ అవుతుంది. అందుకే బంగార్రాజులో బ్రహ్మానందం పాత్రని పెట్టలేదని చెప్పుకొచ్చారు.

కాగా సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో బ్రహ్మానందం ఆత్మానందస్వామిగా నటించి మెప్పించారు. కోవిడ్ మహమ్మారి ఎంటర్ అయిన తర్వాత సినిమాలు చేయడం తగ్గించారు బ్రహ్మానందం.

Tags

Read MoreRead Less
Next Story