Nagarjuna: చై, సామ్ విడాకులపై నాగార్జున చెప్పిన అసలు నిజం ఇది

Nagarjuna: చై, సామ్ విడాకులపై నాగార్జున చెప్పిన అసలు నిజం ఇది
Nagarjuna: సమంత, నాగచైతన్య విడాకులు ప్రకటించి మూడు నెలలు అయిపోతుంది.

Nagarjuna: సమంత, నాగచైతన్య విడాకులు ప్రకటించి మూడు నెలలు అయిపోతుంది. అయినా ఇప్పటికీ వీరి గురించే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌ నడుస్తోంది. ఈ విడాకులకు కారణం ఏంటి? దీనిపై చైతూ, సమంత ఎలా స్పందిస్తున్నారు అని అందరి దృష్టి దీనిపైనే ఉంది. తాజాగా దీని గురించి నాగార్జున స్పందించాడంటూ పలు కథనాలు వినిపిస్తుండగా.. నాగ్ దీనిపై స్పందించారు.

మొదట సమంతనే విడాకులు తీసుకుందామనుకుంది అని చెప్పారు నాగార్జున. నాగచైతన్య దానికి కేవలం ఓకే చెప్పాడు అన్నారు. అతడు తన గురించి చాలా ఆందోళన చెందాడని అన్నారు. తాను ఆ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటానో, కుటుంబ ప్రతిష్ట ఏమవుతుందో అని చైతూ చాలా ఆలోచించాడని చెప్పారు. అయితే నాగార్జున ఇలా ఎక్కడా ప్రస్తావించలేదని క్లారిటీ ఇచ్చేశారు.

తాను నాగచైతన్య, సమంత విడాకుల గురించి మాట్లాడినట్టుగా సోషల్ మీడియాల్లో, టీవీల్లో వస్తున్న వార్తలు ఏ మాత్రం నిజం కాదంటూ ట్వీట్ చేశాడు నాగార్జున. రూమర్స్‌ను వార్తల్లగా చూపించడం మానేయాలి అని మీడియా మిత్రులను కోరుకున్నారు. నాగార్జున.. నాగచైతన్య, సమంత విడాకులపై స్పందించారు అన్న వార్త ఇప్పటికే వైరల్ అవ్వడంతో నాగ్ ఇచ్చిన ఈ క్లారిటీ కూడా కాసేపట్లోనే వైరల్‌గా మారింది.


Tags

Read MoreRead Less
Next Story