Nagarjuna : అమ్మ గుర్తుకువచ్చిందంటూ కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున..

Nagarjuna : శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' సినిమా ట్రైలర్ ఎమోషనల్‌గా ఉంది. సినిమా మొత్తం కూడా అలాగే ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుందని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతున్న ఒకే ఒక జీవితం సినిమాను అక్కినేని నాగార్జున మూవీ టీంతో కలిసి చూశారు. మూవీ ఎలా ఉందని అడిగినప్పుడు ఆయన చాలా భావోద్వేగానికి గురయి కన్నీరు పెట్టుకున్నారు.
చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారన్నారు. సినిమా చూసున్నంత సేపు తనకు కన్నీళ్లు ఆగలేదని చెప్పాడు. మా అమ్మ చూపించిన ప్రమ గుర్తుకువచ్చిందని, ఎమోషనల్‌గా అనిపించిందని నాగార్జున చెప్పుకొచ్చారు.
ఒకే ఒక జీవితం సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లో రిలీజ్ కానుంది. శర్వానంద్, రీతూవర్మ హీరోహీరోయిన్‌గా, అక్కినేని అమల ముఖ్య పాత్రలో నటించారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి సపోర్టింగ్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. శ్రీ కార్తిక్ దీనికి దర్శకత్వం వహించారు. తమిళ్‌లో 'కణం' పేరుతో అదే రోజు రీలీజ్ అవనుంది.
.@iamnagarjuna sir 🙏🏼❤️#OkeOkaJeevitham from Sep 9th 🥰@riturv @amalaakkineni1 @twittshrees @prabhu_sr @DreamWarriorpic pic.twitter.com/P0Bk00yEps
— Sharwanand (@ImSharwanand) September 7, 2022
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com