Nagarjuna : మాస్ లో మళ్లీ చూసేంత మేటర్ ఉందా బాస్

Nagarjuna  :  మాస్ లో మళ్లీ చూసేంత మేటర్ ఉందా బాస్
X

ఏదైనా సినిమాను రీ రిలీజ్ చేస్తున్నాం అంటే ఎంత మేటర్ ఉండాలి. ఆసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసి ఉండాలి. రికార్డ్ సెంటర్స్ లో రన్ టైమ్ ఉండాలి.. కనీసం ఆ హీరో కెరీర్ లో చాలా స్పెషల్ అయినా అయి ఉండాలి కదా.. ఇవన్నీ ఉంటేనే రీ రిలీజ్ అనగానే ఓ స్పైస్ యాడ్ అవుతుంది. అలా కాకుండా ఏదో జస్ట్ ఓ మాస్ మూవీ. రెగ్యులర్ హిట్స్ లో ఒకటిగా ఉంటే ఆ మూవీని చూస్తారా.. ఏమో కానీ అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అలాంటి మూవీనే రీ రిలీజ్ చేస్తున్నారు. ఆయన బర్త్ డే అయినా ఆగస్ట్ 29న మాస్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు.

నాగార్జున హీరోగా నటించి నిర్మించిన సినిమా ‘మాస్’. ఈ మూవీతోనే అప్పటి వరకూ కొరియోగ్రాఫర్ గా ఉన్న లారెన్స్ దర్శకుడుగా మారాడు. అఫ్ కోర్స్ నాగ్ ఛాన్స్ ఇచ్చాడనుకోండి. నాగ్ సరసన జ్యోతిక, ఛార్మీ నటించారు. సునిల్, రఘువరన్, రాహుల్ దేవ్ కీలక పాత్రలు చేశారు. అప్పట్లో రెగ్యులర్ మాస్ మసాలా మూవీలా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. అంతే కానీ ఇందులో అద్భుతం అనిపించుకునే అంశాలేం పెద్దగా కనిపించవు. నాగ్ మాస్ వార్నింగ్ లు, సునిల్ పాత్ర చనిపోవడం.. లాంటివి కూడా అప్పటికే ఎన్నో సినిమాల్లో చూసి ఉన్నాం. బట్ ఆ టైమ్ కు కమర్షియల్ గా వర్కవుట్ అయిపోయింది. విశేషం ఏంటంటే.. ఫస్ట్ మూవీ కాబట్టి దర్శకుడుగా లారెన్స్ మెరుపులు కూడా పెద్దగా కనిపించవు. అలాంటి మూవీని మళ్లీ మళ్లీ చూడాలని ఎవరనుకుంటారు. అనుకున్నా ఆల్రెడీ టివిల్లో చూసే ఉన్నారు.

సో మాస్ లాంటి మసాలా సినిమాను రీ రిలీజ్ చేస్తే ఎగబడి థియేటర్స్ కు వెళ్లడానికి ఫ్యాన్స్ కూడా పెద్దగా ఆసక్తి చూపించరు. దీని ప్లేస్ లో ఇంకేదైనా క్లాసిక్ లాంటి మూవీని మళ్లీ విడుదల చేస్తే ఇంకా బావుంటుందేమో. ఇవన్నీ కాదని కూడా మాస్ కు మంచి ఆదరణ వస్తే అది నాగ్ ఫ్యాన్స్ దమ్ము అనుకోవచ్చు.

Tags

Next Story