Ghost: నాగార్జున ఘోస్ట్.. ధియేటర్‌లో ఫట్టు.. ఓటీటీలో హిట్టు

Ghost: నాగార్జున ఘోస్ట్.. ధియేటర్‌లో ఫట్టు.. ఓటీటీలో హిట్టు
Ghost: కొన్ని సినిమాలు థియేటర్ లో సత్తాచాటుతుంటే.. మరి కొన్ని సినిమాలు ఓటీటీలో దుమ్ములేపుతుంటాయి.

Ghost: కొన్ని సినిమాలు థియేటర్ లో సత్తాచాటుతుంటే.. మరి కొన్ని సినిమాలు ఓటీటీలో దుమ్ములేపుతుంటాయి. మరికొన్ని మూవీస్ థియేటర్ లో బొల్తా కొట్టి... ఓటీటీలో ఓ రేంజ్ వ్యూస్ తో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ట్రెండ్ అన్ని భాషల సినిమాల్లోనూ కనిపిస్తోంది.



అయితే తెలుగులో అక్కినేని నాగార్జున మూవీస్ కు మాత్రం ఎక్కువగా జరుగుతోంది. ఆయన సినిమాలు థియేటర్స్ లో యావరేజ్ అయినా ఓటిటిలో సూపర్ హిట్ అనిపించుకుంటున్నాయి. రీసెంట్ గా దసరాకు వచ్చిన ఘోస్ట్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా తేలింది. బట్.. ఓటిటిలో ఇరగదీస్తోంది. ఇలాగే ఇంతకు ముందు కూడా జరిగింది నాగార్జునకు.


టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు ఈమధ్య బాక్సాఫీస్ అసలు కలిసిరావడంలేదు. సోగ్గాడే చిన్నినాయనా తర్వత ఆ రేంజ్ లో ఆకట్టుకున్న మూవీ ఒక్కటీ లేదు. గతంలో వచ్చిన వైల్డ్ డాగ్ పై నాగ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. నిజానికి అప్పట్లోనే చాలామంది దీన్ని ఓటిటిలో విడుదల చేయాలని సలహా ఇచ్చారు.



నాగ్ వినలేదు. థియేటర్స్ లోనే రిలీజ్ చేశాడు. బట్.. వైల్డ్ డాగ్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా తేలింది. థ్రిల్లర్ మూవీగా టాక్ తెచ్చుకున్న వైల్డ్ డాగ్ దారుణమైన వసూళ్లు రాబట్టింది. కానీ ఇదే మూవీ... నెట్ ఫ్లిక్స్ లో సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఆ టైమ్ లో వరుసగా నాలుగు రోజుల పాటు నెంబర వన్ గా నిలిచింది.

ఇప్పుడు ఘోస్ట్ పరిస్థితీ అదే. థియేటర్స్ లో పోయింది. బట్.. ఓటిటిలో హిట్ టాక్ తెచ్చుకుంది. హిందీ వెర్షన్‌ తొలి స్థానాన్ని దక్కించుకోగా.. తెలుగు వెర్షన్‌ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. రెండు భాషల్లో దిఘోస్ట్ మూవీ ట్రెండింగ్‌లో ఉండటంతో.. చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story