Nagarjuna: ఏ ఇండస్ట్రీలో ఏ హీరోకు లేని రికార్డ్ నాగార్జున సొంతం..

Nagarjuna (tv5news.in)
Nagarjuna: సోగ్గాడు, మన్మథుడు, కింగ్.. ఇవి హీరో నాగార్జునను తన అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేర్లు. నాగార్జునకు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో ఇప్పటికీ సీనియర్ హీరోల్లో మన్మథుడిగా వెలిగిపోతున్నాడు. ఒకపక్క ఫ్యామిలీ సినిమాలు, మరోపక్క రొమాంటిక్ సినిమాలు.. ఈ రెండిటిని తన కెరీర్ మొదటి నుండి బ్యాలెన్స్ చేస్తున్నాడు నాగార్జున. అయితే.. తెలుగులోనే కాదు.. ఏ ఇండస్ట్రీలో ఏ హీరోకు లేని రికార్డు ఒకటి నాగార్జునకు ఉంది.
హీరోలకు ఉన్నంత కెరీర్ లైఫ్ స్పాన్ హీరోయిన్లకు ఉండదు. రెండు జెనరేషన్లకు హీరోయిన్లుగా నటించిన వారు చాలాతక్కువ మందే ఉన్నారు. పైగా తండ్రితో హీరోయిన్‌గా నటించిన వారు కొడుకుతో నటించాలంటే ఆలోచిస్తారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఆ జెనరేషన్‌లోనూ, ఈ జెనరేషన్‌లోనూ తండ్రి, కొడుకులతో జతకడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. నాగార్జున.. అటు తన తండ్రితో నటించిన హీరోయిన్స్‌తో, ఇటు తన కొడుకులతో నటించిన హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తూ ఈ రేర్ రికార్డును సొంతం చేసుకున్నారు.
నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు శ్రీదేవి, రాధ లాంటి హీరోయిన్లతో జోడీకట్టారు. తన తనయుడు నాగార్జున కూడా వీరిద్దరితో పలు సినిమాల్లో కలిసి నటించారు. పైగా నాగార్జున, శ్రీదేవి జోడీ ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్‌కు స్పెషల్‌గా నిలిచిపోయింది. తండ్రితో నటించిన హీరోయిన్లను మాత్రమే కాదు కొడుకుతో నటించిన హీరోయిన్లతో కూడా జోడీకట్టారు నాగార్జున.
అక్కినేని ఫ్యామిలీ సినిమాగా తెరకెక్కిన 'మనం'లో లావణ్య త్రిపాఠి.. నాగచైతన్యకు ఫ్రెండ్‌గా చిన్న పాత్రలో తళుక్కున్న మెరిసింది. ఆ తర్వాత నాగార్జునతో కలిసి 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా చేసింది. ముందుగా నాగార్జునకు హీరోయిన్‌గా నటించిన తర్వాత లావణ్య నాగచైతన్య సరసన కూడా 'యుద్ధం శరణం' అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది.
'రారండోయ్ వేడుక చూద్దాం' లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో మంచి హిట్‌ను అందుకున్నాడు నాగచైతన్య. ఇందులో తనకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఆ తర్వాత రకుల్.. నాగార్జునతో మన్మథుడు 2 లో జతకట్టింది. ఒకప్పటి క్లాసిక్ సినిమా మన్మథుడుకు సీక్వెల్‌గా వచ్చిన మన్మథుడు2 ప్రేక్షకుల అంచాలను అందుకోలేకపోయింది.
కాజల్ అగర్వాల్ ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నా, చిరంజీవి లాంటి సీనియర్ హీరోతో జతకట్టినా నాగార్జునతో నటించే అవకాశం మాత్రం తనకు ఎప్పుడు రాలేదు. అందుకే తన తనయుడు నాగచైతన్యతో 'దడ' అనే మూవీలో కలిసి నటించింది. ఆ సినిమా విడుదలయిన చాలాకాలం తర్వాత ప్రస్తుతం నాగార్జున, కాజల్ కలిసి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ది ఘోస్ట్' అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా నుండి కాజల్ తప్పుకుంది అన్న వార్తలు వచ్చినా మూవీ టీమ్ నుండి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com