Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ ఓటీటీ హోస్ట్ నాగార్జున కాదు..! మరి ఎవరంటే..?

Nagarjuna (tv5news.in)
Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ రియాలిటీ షోకు సీజన్ సీజన్‌కు ఆదరణ పెరుగుతూనే ఉంది.ముందుగా హిందీలో మొదలయిన ఈ రియాలిటీ షో.. ప్రస్తుతం దేశంలోని పలు భాషల్లో ఈ రియాలిటీ షో ప్రచురితమవుతోంది. తెలుగులో అయిదు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. అందుకే 24 గంటలు బిగ్ బాస్.. ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి అనే ఆలోచనతో బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్‌ను ప్రారంభించనుంది బీబీ టీమ్.
బిగ్ బాస్ ఓటీటీ అంటే టీవీల్లో రాదు. అది కేవలం ఓటీటీ వరకు పరిమితం. కానీ 24 గంటలు బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం బిగ్ బాస్ ఓటీటీ ఇస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఫస్ట్ సీజన్‌కు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇందులో కంటెస్టెంట్స్ ఎవరూ అనేదానిపై రూమర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ ఓటీటీలో మరోసారి కనిపించనున్నారని టాక్.
బిగ్ బాస్ తెలుగు మొదలయినప్పటి నుండి ఎన్‌టీఆర్, నాని, రెండు సీజన్లకు హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఆ తర్వాత వరుసగా మూడు సీజన్లకు నాగార్జునే హోస్ట్‌గా బిగ్ బాస్‌ను ముందుకు నడిపించారు. కానీ బిగ్ బాస్ ఓటీటీకి మాత్రం నాగార్జునను కాకుండా ఓంకార్‌ను హోస్ట్‌గా తీసుకునే ఆలోచనలో ఉందట బీబీ టీమ్. బిగ్ బాస్ ఓటీటీ నిర్మాణంలో ఓంకార్ సంస్థ ఓక్ ఎంటర్‌టైన్మెంట్ కూడా భాగస్వామిగా వ్యవహరిస్తుండడంతో తననే హోస్ట్‌గా సెలక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com