The Ghost: లేటు వయసులో ఘాటు ప్రేమలు.. నీటి అడుగున ముద్దులు

The Ghost: వయసు 60 దాటినా వన్ పర్సంట్ కూడా తగ్గేదేలే అంటున్నాడీ నవ మన్మధుడు.. బంగార్రాజుతో హిట్ కొట్టి మంచి జోరుమీదున్న నాగార్జున.. సోనాల్ చౌహాన్ తో రొమాన్స్ చేయడానికి దుబాయ్ వెళ్లారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న దెయ్యం చిత్రం షూటింగ్ నిమిత్తం టీమ్ అంతా దుబాయ్ వెళ్లారు.
చిత్రానికి సంబంధించిన చాలా భాగం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుందని, సినిమాలోని ప్రధాన తారాగణంతో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తామని చిత్రబృందం వెల్లడించింది.
నాగార్జునతో సోనాల్ చౌహాన్ కి ఇది మొదటి చిత్రం. ది ఘోస్ట్ చిత్రీకరణకు సంబంధించిన ప్రదేశాల నుండి నాగార్జున అక్కినేని, సోనాల్ చౌహాన్‌ల ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నాగార్జున వైట్ షర్ట్, ఫార్మల్ ప్యాంట్‌తో కనిపిస్తున్నాడు. సోనాల్ కలిసి పోజులిచ్చాడు. వీరిద్దరి మధ్య నీటి అడుగున ముద్దు సన్నివేశాలు ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.
మొదట్లో మేకర్స్ ఈ చిత్రంలో నాగార్జున పక్కన నటించడానికి కాజల్ అగర్వాల్‌ను ఎంచుకున్నారు. కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. తర్వాత మేకర్స్ అమలా పాల్‌ని తీసుకున్నారు. ఆమెతో ఈ ముద్దు సన్నివేశాన్ని కూడా చిత్రీకరించింది. కానీ ఏమైందో ఏమో ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. తర్వాత మేకర్స్ సోనాల్ చౌహాన్‌ను రంగంలోకి దించారు. నాగార్జున, సోనాల్ తో పాటు ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కూడా మరి కొన్ని ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com