Akkineni Nagarjuna : సామిరంగా.. మళ్లీ సంక్రాంతికి వస్తున్నాడా నాగ్

Akkineni Nagarjuna : సామిరంగా.. మళ్లీ సంక్రాంతికి వస్తున్నాడా నాగ్
X

అక్కినేని నాగార్జున కొన్నాళ్లుగా సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన నా సామిరంగా నాగ్ కు సాలిడ్ హిట్ గా నిలిచింది. మరింజు పొరియం జోస్ అనే మళయాల మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని 2023 సెప్టెంబర్ లోనే హడావిడీగా మొదలుపెట్టారు. అనౌన్స్ మెంట్ తోనే ఆసక్తి రేకెత్తించారు. అదే టైమ్ లో సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించారు. అయితే అంత తక్కువ టైమ్ లో సినిమా చేసి సంక్రాంతికి విడుదల చేయడం అసాధ్యం అనే కమెంట్స్ వచ్చాయి. కొందరు క్వాలిటీ అవుట్ పుట్ రాదు అన్నారు. బట్ నా సామిరంగా టీమ్ అవేం పట్టించుకోలేదు. హార్డ్ వర్క్ చేసింది. బెస్ట్ అవుట్ పుట్ నే ఇచ్చింది. చెప్పినట్టుగా సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టారు.

మరోసారి నా సామిరంగా ఫీట్ ను రిపీట్ చేయాలనుకుంటున్నాడట నాగ్. ఈ సారి కూడా ఏదైనా చిన్న మూవీ ప్లాన్ చేసుకుని ఓ కొత్త దర్శకుడిని పెట్టుకుని వేగంగా మూవీ చేసి 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడట. ఏదైనా రీమేక్ అయితే కొంత వరకు సాధ్యమే. అలాగే చిన్న కథ, ఎక్కువ లొకేషన్స్ లేకుండా ఉండే కథైనా ఓకే. అతను అనుకున్నది సాధ్యం అవుతుంది.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ తో పాటు ఓ కీలక పాత్ర చేస్తున్నాడు నాగ్. ఈ మూవీ వచ్చే యేడాదే విడుదలవుతుందంటున్నారు. దానికంటే ముందే తను హీరోగా సినిమా చేస్తే ఎలా ఉంటుందా అనేదే నాగ్ ఆలోచనట. అయినా ఏమో.. ప్లానింగ్ అంటున్నారు కానీ.. ఆల్రెడీ మొదలుపెట్టే ఉంటే..? నాగ్ సంక్రాంతికి రావడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఈ సారి సంక్రాంతి మామూలుగా లేదు మరి.

Tags

Next Story