Nagarjuna: వాళ్ల విడాకులు.. వీళ్ల మాటలు.. బాధించాయి: నాగార్జున ఎమోషన్

Nagarjuna: వాళ్ల విడాకులు.. వీళ్ల మాటలు.. బాధించాయి: నాగార్జున ఎమోషన్
Nagarjuna: నా ఫ్యామిలీ గురించి నెగటివ్‌గా వార్తలు రాయడం చాలా బాధించింది అని ఆయన అన్నారు.

Nagarjuna: కొడుకు, కోడలు సంతోషంగా ఉంటే తండ్రికి అంతకంటే కావల్సింది ఏముంటుంది. కానీ ఏమైందో ఇద్దరూ విడిపోయారు.. అభిమానులనే బాధించిన ఆ విషయం నాగార్జునను మరింత వేదనకు గురి చేసి ఉంటుంది. కానీ వాళ్ల అభిప్రాయాలకు విలువిస్తూ ఏమీ మాట్లాడలేదన్న విషయం అర్థమవుతోంది.

విడాకులకు కారణం ఇదేనంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టులు.. ఏమీ తెలియకపోయినా ఏదేదో రాసేస్తున్నారు.. అవి ఎంత బాధిస్తాయో అర్థం చేసుకోరు అని నాగార్జున ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

నాపై అసత్య వార్తలు ప్రచారం చేసినా పట్టించుకోలేదు.. కానీ నా ఫ్యామిలీ గురించి నెగటివ్‌గా వార్తలు రాయడం చాలా బాధించింది అని ఆయన అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ఇలాంటి వార్తలను తాను అస్సలు పట్టించుకోనని చెప్పుకొచ్చారు.

కాగా, సామ్ చైతూ విడాకుల ప్రకటన తర్వాత కొన్ని రోజులు ముభావంగా ఉన్నా.. అనంతరం తమని తాము సముదాయించుకుని వారి జీవితాల్లో వారు బిజీగా ఉంటున్నారు. వరుస ప్రాజెక్టులతో సమంత బిజీగా ఉంటే బంగార్రాజు హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన చైతన్య తన తదుపరి ప్రాజెక్టులను పరిశీలించే పనిలో ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story