Nagarjuna Bangarraju Movie: బంగార్రాజు కోసం అంతమంది భామలా.!

Nagarjuna Bangarraju Movie: ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఉన్నప్పుడే కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాంటిది ఇద్దరు లేదా ముగ్గురు ముద్దుగుమ్మలు ఉంటే ప్రేక్షకుల్లో ఆ సినిమా పట్ల ముందు నుండే క్రేజ్ పెరిగిపోతుంది. అయితే ఈ అప్‌కమింగ్ సినిమాలో ఏకంగా అయిదుగురు భామలు మెరవబోతున్నారని సమాచారం. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా.. అదే నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన ప్రీక్వెల్ బంగార్రాజు. నాగార్జునను టాలీవుడ్ మన్మథుడని తన ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు.
అందుకే ఆయన రొమాన్స్‌కు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఏ హీరోయిన్‌తో అయినా కెమిస్ట్రీ పండిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో తనకు తానే సాటి. తాను నటించిన సోగ్గాడే చిన్నినాయనలోని ఒక పాటలో ఏకంగా ముగ్గురు భామలతో కలిసి స్టెప్పులేసిన నాగార్జున.. బంగార్రాజు కోసం కూడా అదే ఫార్ములా రిపీట్ చేయబోతున్నాడట.ఈ సినిమాలో తనకు జోడీగా రమ్యక్రిష్ణ నటిస్తుండగా.. ఇందులో మరో కీలక పాత్ర పోషిస్తున్న నాగచైతన్యతో క్రితి శెట్టి జతకట్టనుంది. వీరిద్దరి గురించి మూవీ టీమ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే వీరు మాత్రమే కాకుండా ఇందులో మరో ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నారని టాక్ నడుస్తోంది.
బిగ్ బాస్‌లో కనిపించి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయిన మోనాల్ గజ్జర్‌తో తాను నటిస్తానని నాగ్ తనకు ఎప్పుడో మాటిచ్చాడు. అందుకే తనకు బంగార్రాజులో ఒక కీలక పాత్రను చేసే అవకాశాన్ని అందించినట్టు సమాచారం. తనతో పాటు వేదిక, మీనాక్షి చైదరీ లాంటి ముద్దుగుమ్మలు కూడా నాగ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. అంతే కాకుండా ఈ ముగ్గురు స్వర్గంలోని రంభ, ఊర్వశీ, మేనక పాత్రలలో కనిపించి ప్రేక్షకులను అలరించనున్నారట. ఇంతమంది హీరోయిన్లతో నాగ్ రొమాన్స్ బంగార్రాజుకు ప్లస్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com