సినిమా

Nagarjuna: విడాకుల తర్వాత చైతూ మానసిక పరిస్థితి గురించి బయటపెట్టిన నాగార్జున..

Nagarjuna: సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న అక్కినేని కుటుంబానికి సమంత, నాగచైతన్యల విడాకుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

Nagarjuna: విడాకుల తర్వాత చైతూ మానసిక పరిస్థితి గురించి బయటపెట్టిన నాగార్జున..
X

Nagarjuna: సమంత, నాగచైతన్య విడాకుల విషయం ఒక్కసారిగా టాలీవుడ్‌లో పెద్దగా సెన్సేషన్నే క్రియేట్ చేసింది. పదేళ్లు హ్యాపీగా ఉన్న కపుల్ ఒక్కసారిగా విడాకులు లాంటి పెద్ద నిర్ణయం తీసుకోవడమేంటి అని అందరూ షాక్ అయ్యారు. కొన్నాళ్ల వరకు ఎక్కడ చూసినా దీని గురించే చర్చలు కూడా నడిచాయి. ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని మెల్లగా అందరూ మర్చిపోతున్నారు. ఇంతకాలం తర్వాత అక్కినేని కుటుంబం ఈ విషయంపై స్పందించడం మొదలుపెట్టింది.

నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన మల్టీ స్టారర్ 'బంగార్రాజు' సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌తో పాటు కలెక్షన్లను కూడా సాధిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న అక్కినేని కుటుంబానికి సమంత, నాగచైతన్యల విడాకుల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల నాగచైతన్య దానిపై స్పందించగా.. నాగార్జున కూడా ఈ విషయం గురించి బయటపెట్టారు.

సమంత, నాగచైతన్య మధ్య ఏం జరిగిందో.. అది చాలా దురదృష్టకరం అన్నారు నాగార్జున. ఒక భార్య, భర్త మధ్య జరిగే విషయం చాలా వ్యక్తిగతం అన్నారు. వారిద్దరంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. అంతే కాకుండా విడాకుల సమయంలో నాగచైతన్య మానసిక పరిస్థితి గురించి కూడా వివరించారు నాగ్.

ఆ సమయంలో నాగచైతన్య ప్రశాంతంగా ఉండడం చూసి తనకు చాలా గర్వంగా అనిపించింది అన్నారు నాగార్జున. తాను ఒక్క మాట కూడా తొందరపడి మాట్లాడడానికి ఇష్టపడలేదు అన్నారు. ఒక తండ్రి లాగా నేను తన గురించి బాధపడుతుంటే.. తను మాత్రం నా గురించి బాధపడేవాడు. ఎప్పటికప్పుడు నా దగ్గరకు వచ్చి నేను ఎలా ఉన్నానని కనుక్కునేవాడని తెలిపారు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES