Soggade Chinni Nayana : సోగ్గాడే చిన్నినాయనాకి ఆరేళ్ళు.. నాగ్ ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేసిన యంగ్ డైరెక్టర్..!

Soggade Chinni Nayana : సోగ్గాడే చిన్నినాయనాకి ఆరేళ్ళు.. నాగ్ ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేసిన యంగ్ డైరెక్టర్..!
Soggade Chinni Nayana : ఆత్మీయత, అనుబంధం, చక్కటి పంచెకట్టు, పల్లెటూరు వాతావరణం, ఎంటర్టైన్మెంట్ ఇవన్ని కలిపితే "సోగ్గాడే చిన్నినాయనా" సినిమా...

Soggade Chinni Nayana : ఆత్మీయత, అనుబంధం, చక్కటి పంచెకట్టు, పల్లెటూరు వాతావరణం, ఎంటర్టైన్మెంట్ ఇవన్ని కలిపితే "సోగ్గాడే చిన్నినాయనా" సినిమా... నాగార్జున డ్యూయల్ రోల్‌‌లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 15, 2016 సంక్రాంతికి రిలీజై బ్లాక్‌‌బస్టర్ హిట్ అందుకుంది. నేటితో ఈ సినిమాకి ఆరేళ్ళు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం.

రాజ్ తరుణ్, అవికా గొర్ మెయిన్ లీడ్‌‌లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాకి అక్కినేని నాగార్జున నిర్మాత. విరించి వర్మ దర్శకుడు..రామ్మోహన్ కథారచయిత.. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇలా పల్లెటూరు బ్యాక్ డ్రాప్‌‌లో ఓ సినిమా చేయాలని ఉందని, కథ ఉంటే రెడీ చేయమని రచయిత రామ్మోహన్, దర్శకుడు విరించి వర్మకి ఆఫర్ ఇచ్చారు నాగ్.. కానీ ఈ ఆఫర్‌‌ని దర్శకుడు విరించి వర్మ రిజెక్ట్ చేశారు.

ఈ క్రమంలో దర్శకుడు తేజ, రైటర్ పోసానిల దగ్గర అసిస్టెంట్‌‌గా పనిచేసి దర్శకుడిగా ఎంట్రీకోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ కృష్ణకి ఈ ఆఫర్ వచ్చింది. నాగ్ చెప్పిన సలహాలతో మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకొచ్చాడు కళ్యాణ్ కృష్ణ. అతని వర్క్‌‌కి మెచ్చిన నాగ్.. దర్శకుడిగా అతనికే అవకాశం ఇచ్చాడు. స్క్రిప్ట్‌‌కి మరిన్ని మెరుగులు దిద్దడం కోసం సీనియర్ రైటర్ సత్యానంద్‌‌తో కలిసి పనిచేశారు కళ్యాణ్ కృష్ణ.

ఇందులో రాము పాత్రని మీలో ఎవరు కోటీశ్వరుడులోని పాల్గొన్న ఊమాకాంత్ అనే వ్యక్తి ఆధారంగా డిజైన్ చేశారు. నాగ్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ హీరోయిన్‌‌గా ఫిక్స్ అవ్వగా, మరో హీరోయిన్ కోసం ప్రణీత, సోనాలి చౌహాన్‌‌ని అనుకున్నారు. ప్రణీత రిజెక్ట్ చేయడంతో లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు. ముందుగా ఆమె కూడా చేయడానికి సందేహించింది కానీ .. స్క్రిప్ట్ మొత్తం విన్నాక చేసేందుకు ఒప్పుకుంది.

ముందుగా ఈ సినిమాకి బంగార్రాజు అనే టైటిల్‌‌ని అనుకున్నారు కానీ అక్కినేని నాగేశ్వరరావు గుర్తుగా ఆయన సినిమా పాటైన సోగ్గాడే చిన్నినాయనాని టైటిల్‌‌గా పెట్టారు నాగ్.. అనుష్క, అనసూయ గెస్ట్ రోల్ చేసారు. ముందుగా అనసూయ చేసిన బుజ్జి పాత్రకి హీరోయిన్ స్వాతిరెడ్డిని అనుకున్నారు. అనసూయకి ఫస్ట్ మూవీ కావడం విశేషం.

రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ చేశారు. టెంపుల్ సీన్స్ కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని 1,500 సంవత్సరాల నాటి పురాతన విష్ణు దేవాలయంలో చిత్రీకరించారు. సినిమా రష్ చూసిన నాగ్ మరిన్ని సలహాలు చెప్పారు. వీటికి రచయిత సాయి మాధవ్ బుర్రా సన్నివేశాలు, సంబాషణలు రాసి ఇచ్చారు.

ఈ సినిమాకి నాగార్జున రెమ్యునరేషన్ కాకుండా మొత్తం తొమ్మిది కోట్ల బడ్జెట్ అయింది. 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా 2016 జనవరి 15న సంక్రాంతికి రిలీజైంది. రిలీజ్ రోజున అక్కినేని అభిమానులు ధియేటర్ వద్ద భారీ హంగామా చేశారు. అనూబ్ పాటలు, సినిమా ట్రైలర్ సినిమా పైన అంచనాలు పెంచడంతో ఫ్యాన్స్ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఆ హోప్స్ కి ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండడంతో సోగ్గాడే మొదటి ఆట నుంచే హిట్ టాక్ సొంతం చేసుకొని కాసుల వర్షం కురిపించింది.

ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలయ్య డిక్టేటర్ సినిమాలకి పోటీగా వచ్చి సంక్రాంతి సినిమా అనిపించుకుంది సోగ్గాడే చిన్నినాయనా. మొత్తం ఈ సినిమా ఓవరాల్ గా 50 కోట్లపైగా షేర్ ని కొల్లగొట్టింది. 50 కోట్లకి పైగా షేర్ వసూళ్ళు సాధించిన మొదటి సీనియర్ హీరో నాగే కావడం విశేషం. ఈ సినిమాని కన్నడలో ఉపేంద్ర రీమేక్ చేయగా, తమిళ్, హిందీలో డబ్బింగ్ అయింది. ఈ సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు చిత్రం తెరకెక్కి ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకోవడం మరో విశేషం.

Tags

Read MoreRead Less
Next Story