Ntr Devara : ఎన్టీఆర్ పాటపై నాగవంశీ లీకులు

Ntr Devara :   ఎన్టీఆర్ పాటపై నాగవంశీ లీకులు
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సెకండ్ సాంగ్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా చూస్తున్నారు. ఫస్ట్ వచ్చిన ఫియర్ సాంగ్ కు జనం ఫిదా కాలేదు. పైగా మాగ్జిమం ఇంగ్లీష్ వర్డ్స్ లో ఉండటం మాస్ ఆడియన్స్ కు నచ్చలేదు. ఆర్ఆర్ఆర్ కు ముందు ఎన్టీఆర్ చేసిన మూవీ అరవింద సమేత. ఈ మూవీలో చాలా గ్లామర్ గా కనిపిస్తాడు. అప్పుడప్పుడూ లవర్ బాయ్ లానూ ఉంటాడు. ఈ విషయాన్ని చెబుతూ ఇన్ డైరెక్ట్ గా దేవర రెండో పాటకు సంబంధించిన హింట్స్ ఇచ్చాడు నాగవంశీ.

నాగవంశీకి ఎన్టీఆర్ అంటే ఇష్టం అని అందరికీ తెలుసు. అందుకే దేవర సాంగ్ గురించి తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ లో హింట్ ఇచ్చాడు. అక్కడ అరవింద సమేత మూవీలో ఎన్టీఆర్ స్మార్ట్ గా ఉన్న ఫోటోస్ పెట్టి.. ‘‘ తారక్ అన్ననని ఇలా క్యూట్ గా చూసి 6యేళ్లు అయింది కదా.. మళ్లీ ఆ క్యూట్ గా స్మైల్ చేస్తూ రొమాన్స్ చేయడం చూస్తారు ఈ సారి.. మనకి అదే సరిపోతుంది కదా..’’ అని రాశాడు. అంటే ఇదంతా దేవర సాంగ్ గురించే అని ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీలవుతున్నారు.

దేవర ఫస్ట్ లుక్ నుంచి టీజర్ వరకూ చూసిన తర్వాత ఎన్టీఆర్ నుంచి మరోసారి సీరియస్ క్యారెక్టర్ నే చూడబోతున్నాం అనుకున్నారు. అదే కాదు.. మనోడు ఈ సారి రొమాంటిక్ యాంగిల్ ను కూడా చూపించబోతున్నాడు అనే ఫీలర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సాంగ్ చాలా కలర్ ఫుల్ గా కూడా ఉండబోతోందని కూడా అన్నారు. అందుకే ఇప్పుడు నాగవంశీ ట్వీట్ ఇమ్మీడియొట్ గా కనెక్ట్ అయింది. సో.. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య ఓ మాంచి రొమాంటిక్ సాంగ్ రాబోతోందన్నమాట.

Tags

Next Story