Nithiins : ‘తమ్ముడు’ తప్పుకుంటాడా.. ఎదుర్కొంటాడా..?

Nithiins :  ‘తమ్ముడు’ తప్పుకుంటాడా.. ఎదుర్కొంటాడా..?
X

స్టార్డమ్ అనేది ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. దాదాపు రెండు దశాబ్దాల క్రితమే ఇండస్ట్రీకి వచ్చినా.. ఇప్పటికీ స్టార్ హీరో అని చెప్పడానికి కాస్త సంశయించే హీరో నితిన్. అతనికీ సూపర్ హిట్స్ ఉన్నాయి. కానీ అంతకు మించిన డూపర్ ఫ్లాప్ లు వచ్చాయి.. వస్తున్నాయి. కొన్నాళ్లుగా కోలుకోలేని ఎదురు దెబ్బలు తింటున్నాడు. తను ఎంతో నమ్మకం పెట్టుకున్న కథలన్నీ బాక్సాఫీస్ వద్ద కల్లలుగా మిగిలిపోతున్నాయి. హిట్ అనే మాట విని చాలాకాలం అయింది. నిజానికి నితిన్ కెరీర్ ఎప్పుడూ నిలకడగా ఉండదు. ఒక హిట్ పడితే ఐదారు ఫ్లాపులు పడతాయి. ఒక్కోసారి అంతకు మించిన డిజాస్టర్స్ చూసిన సందర్భాలున్నాయి. అలాంటి నితిన్ చివరి సినిమా రాబిన్ హుడ్ ను చాలా నమ్మాడు. అదీ పోయింది. ఇక నెక్ట్స్ ‘తమ్ముడు’ అనే మూవీతో వస్తున్నాడు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీని జూలై 4న విడుదల చేయబోతున్నాం అని రీసెంట్ గానే ప్రకటించారు. తాజాగా ఆర్టిస్ట్ లను పరిచయం చేస్తూ అదిరిపోయే వీడియో కూడా వదిలారు. ఇక రిలీజ్ కన్ఫార్మ్ అనుకుంటోన్న టైమ్ లో తమ్ముడికి విజయ్ దేవరకొండ షాక్ ఇచ్చాడు.

నితిన్ కంటే చాలా చాలా వెనక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు స్టార్ గా మారాడు. ఓ సాలిడ్ హిట్ పడితే అతని రేంజ్ మరింత మారిపోతుంది. ఓ రేంజ్ లో క్రేజ్ కూడా సంపాదించుకున్నాడు. ఎలా చూసినా ఇప్పుడు నితిన్ కంటే విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాంటి విజయ్ నటించిన ‘కింగ్ డమ్’చిత్రాన్ని జూలై 4న విడుదల చేయబోతున్నాం అని ఇవాళే(బుధవారం) ప్రకటించారు. దీంతో తమ్ముడికి షాక్ తప్పలేదు. మరో విశేషం ఏంటంటే.. ఈ మూవీ నిర్మాత నాగవంశీకి, దిల్ రాజుకు మధ్య మంచి ర్యాపో ఉంది. ఆ కారణంగా అడ్జెస్ట్ మెంట్స్ తో మరోసారి నితిన్ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది.

పాపం నితిన్.. ఇంతకు ముందు రాబిన్ హుడ్ పరిస్థితి కూడా అదే అయింది. పుష్ప 2 బాగా ఆడుతోందని రాబిన్ హుడ్ ను 2024 డిసెంబర్ నుంచి పోస్ట్ పోన్ చేశారు మైత్రీ మేకర్స్. తర్వాత సంక్రాంతి అన్నారు. శివరాత్రి అన్నారు. ఫైనల్ గా మార్చి 27న విడుదలై డిజాస్టర్ గా తేలింది. అసలు చూస్తే మార్చి 27న తమ్ముడు రావాలి. రాబిన్ హుడ్ కోసం జూలైకి వచ్చాడు. సో.. రాబిన్ హుడ్ తర్వాత తమ్ముడికీ వాయిదాల పర్వం తప్పడం లేదు.

Tags

Next Story