Abhignya : ఆకట్టుకుంటోన్న విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్ ట్రైలర్‌

Abhignya :  ఆకట్టుకుంటోన్న విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్ ట్రైలర్‌
X

ఇండియాస్ పాపులర్ ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో జీ5 ఒకటి. వైవిధ్యమైన కథలు, థ్రిల్లర్స్, షోస్ తో ఆకట్టుకునే జీ 5 నుంచి త్వరలోనే మరో థ్రిల్లర్ సిరీస్ రాబోతోంది. సోషల్ మీడియాలో పాపులర్ అయిన అభిజ్ఞ ఊతలూరు ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ పేరు ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’.‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్‌పై కేవీ శ్రీరామ్ నిర్మించారు. ఈ సిరీస్ ఈ నెల 27 నుంచి జీ5లో స్ట్రీమ్ కాబోతోంది.

ఈ క్రమంలో తాజాగా ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విరాటపాలెం గ్రామంలో ఓ శాపం ఉంటుంది. ఆ ఊర్లో ఏ పెళ్లి జరిగినా సరే మరుసటి రోజు పెళ్లి కూతురు చనిపోతుంటుంది. అలా పదేళ్లుగా ఆ ఊరిని శాపం పట్టి పీడిస్తుందని ప్రజలు నమ్ముతుంటారు. అలాంటి ఊరికి లేడీ కానిస్టేబుల్‌ మీనా (అభి) వస్తుంది. ఊరి ప్రజల మూఢ నమ్మకాన్ని, ఆ ఊరి రహస్యాల్ని పటా పంచెలు చేయడానికి పెళ్లికి రెడీ అవుతుంది మీనా. ఆ తరువాత ఏం జరిగింది? అసలు ఈ మరణాల వెనుకున్న ఉన్నది ఏంటి? కానిస్టేబుల్ మీనా నిజాన్ని ఊరి ప్రజలకు తెలిసేలా చేసిందా? లేదా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా ట్రైలర్‌ను కట్ చేశారు.ఇక ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇది 80వ దశకంలో సాగే కథలా కనిపిస్తోంది.

చరణ్ లక్కరాజు, లావణ్య సాహుకర, రామరాజు, గౌతమ్ రాజు, సతీష్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. దివ్య తేజస్వి పెరా ఈ సిరీస్‌కు కథను, విక్రమ్ కుమార్ కండిమల్ల స్క్రీన్‌ప్లేని అందించారు. రోహిత్ కుమార్ నేపథ్య సంగీతం సమకూర్చారు. మహేష్ కె స్వరూప్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేశారు. ఫరూఖ్ హుండేకర్ ఎడిటర్. మొత్తంగా ఈ నెల 27 నుంచి స్ట్రీమ్ కాబోతోన్న ఈ సిరీస్ మంచి ట్రైలర్ తో అంచనాలను పెంచిందనే చెప్పాలి.

Tags

Next Story