Namit Malhotra: ఆస్కార్ అందుకున్న ఇండియన్ నమిత్ మల్హోత్రా.. ఇది 7వ సారి..

Namit Malhotra: ఆస్కార్ అందుకున్న ఇండియన్ నమిత్ మల్హోత్రా.. ఇది 7వ సారి..
Namit Malhotra: విజువల్ ఎఫెక్ట్స్ అనేవి ఒక కథ చెప్పడంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో డ్యూన్ నిరూపించింది.

Namit Malhotra: ఆస్కార్ అనేది సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారం. సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతీ ఒక్కరూ ఏదో ఒకరోజు ఆస్కార్ అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఆస్కార్ ఎక్కువగా ఫారిన్ భాషలకే వెళ్లింది. ఆస్కార్ ఇండియాకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. తాజాగా ఓ ఇండియన్‌కు ఆస్కార్ దక్కింది. అది కూడా ఓ హాలీవుడ్ ఫిల్మ్‌కు పనిచేసినందుకు.

ఆస్కా్ర్ 2022లో అత్యధిక ఆస్కార్ అవార్డులు అందుకున్న చిత్రంగా నిలిచింది 'డ్యూన్'. ఈ సినిమాకు అన్ని విభాగాల్లో కలిపి 6 అవార్డులు అందాయి. అయితే అందులో ఒకటి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్. డ్యూన్‌కు విజువల్ ఎఫెక్ట్స్ చేసిన కంపెనీ 'డీఎన్ఈజీ'. ఈ కంపెనీ ఛైర్మన్ ఇండియన్ నమిత్ మల్హోత్రా. మూడు తరాలుగా నమిత్ ఫ్యామిలీ మూవీ మేకింగ్‌లోనే పనిచేస్తోంది. డ్యూన్‌కు అవార్డ్ వచ్చిన సందర్భంగా నమిత్ తన భావాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.


'విజువల్ ఎఫెక్ట్స్ అనేవి ఒక కథ చెప్పడంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో డ్యూన్ నిరూపించింది. రానున్న రోజుల్లో విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రస్తావన వస్తే.. డ్యూన్‌కు ముందు, డ్యూన్‌కు తర్వాత అని మాట్లాడుకుంటారేమో. ముంబాయిలో ఓ చిన్న షెడ్‌లో బిజినెస్‌ను ప్రారంభించాను. హాలీవుడ్‌లో జీరో నుండి నా ప్రయాణం మొదలుపెట్టాను. ఇప్పుడు ఇండియన్స్ సాధించలేనిది ఏదీ లేదు అని అనిపిస్తుంది'. అన్నారు నమిత్ మల్హోత్రా.

విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో నమిత్ మల్హోత్రా డీఎన్‌ఈజీ కంపెనీకి ఇప్పటికే 6 ఆస్కార్ అవార్డులు వచ్చాయి. డ్యూన్‌కుగానూ 7వ అవార్డు అందుకుంటున్నందుకు డీఎన్‌ఈజీ ఛైర్మన్‌గా, ఒక ఇండియన్‌గా చాలా గర్వపడుతున్నానన్నారు నమిత్.

Tags

Read MoreRead Less
Next Story