Naga Chaitanya : నాగ చైతన్య, సాయి పల్లవి తాండవం

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న సినిమా ‘తండేల్’. చందు మొండేటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాస్ నిరమించాడు. అల్లు అరవింద్ సమర్పకుడు. ఫిబ్రవరి 7న విడుదల కాబోతోన్న తండేల్ నుంచి నమో నమశ్శివాయ సాంగ్ విడుదల చేస్తాం అని ప్రోమోతో అనౌన్స్ చేసినప్పుడే ఇది హిట్ సాంగ్ అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తోన్న తండేల్ నుంచి ఈ సెకండ్ సింగిల్ ను విడుదల చేశారు.
జొన్నవిత్తుల రాసిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, హరిప్రియ పాడారు. పాటలో డ్యాన్సులు అదిరిపోయాయి. సాయి పల్లవితో పోటీ పడి మరీ నాగ చైతన్య స్టెప్పులు వేశాడు. కాకపోతే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో సహజత్వం లోపించింది. అంటే ఈ మూవీ శ్రీకాకుళ ప్రాంతం నుంచి సముద్ర జలాల్లో తప్పిపోయి పాక్ జలాల్లోకి వెళ్లి అక్కడి నేవీకి దొరికిన కొందరు జాలరుల కథ. ఈ పాట చూస్తే ఆ కథకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రాంతీయత అస్సలు లేదు. పైగా సంగీతంలో తమిళ్ ఫ్లేవర్ చాలా ఎక్కువగా మిక్స్ అయింది. ఎంత ప్యాన్ ఇండియా మూవీ అయినా ఇలా చేయడం తెలుగు వారికి ఇబ్బందే. కన్నడ మూవీ కాంతారలో వారి ప్రాంతీయతే కదా అందరికీ నచ్చింది. అది ఈ పాటలో పూర్తిగా లోపించింది అనే చెప్పాలి. కాకపోతే శివరాత్రి పర్వ దినాలలో భక్తులకు మంచి భక్తి భావాన్ని కలిగించేలా మాత్రం ఉంది.
లవ్ స్టోరీ తర్వాత మరోసారి కలిసి నటిస్తోన్న నాగ చైతన్య, సాయి పల్లవి జంట బావుంది. ఇది భిన్నమైన కథ. మంచి నటీ నటులు అవసరం. చైతన్యకు ఈ నేపథ్యంలో కథ కొత్తదే. బట్ లవ్ స్టోరీ చేసిన తర్వాత ఇలాంటివి పెద్ద కష్టమేం కాకపోవచ్చు. మొత్తంగా శివరాత్రి నెలలో రాబోతోన్న ఈ మూవీపై నాగ చైతన్యతో పాటు అక్కినేని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com