Namrata Shirodkar: తన లిటిల్ సీక్రెట్‌ను బయటపెట్టిన నమ్రత.. పెళ్లిరోజు సందర్భంగా..

Namrata Shirodkar: మహేశ్ బాబు అప్పుడప్పుడే సినిమాల్లో గుర్తింపు తెచ్చుకుంటూ అమ్మాయిలకు క్రష్‌గా మారుతున్నాడు. అదే సమయంలో నమ్రత తన లైఫ్‌లోకి వచ్చి మాయ చేసింది. మహేశ్, నమ్రత కలిసి 'వంశీ' అనే సినిమా చేశారు. ఈ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేదు. కానీ వీరిద్దరి ప్రేమకు మాత్రం ఈ సినిమానే కారణం. అప్పుడే వీరి పెళ్లయ్యి 17 ఏళ్లు అయిపోయింది అంటే నమ్మడం కొంచెం కష్టమే.
నమ్రత, మహేశ్.. ఇద్దరు ఆఫ్ స్క్రీన్ పెద్దగా హైలెట్ అవ్వడానికి ప్రయత్నించరు. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కూడా ఉండరు. నమ్రత తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో పర్సనల్ లైఫ్ గురించి పోస్ట్ చేసినా.. మహేశ్ మాత్రం అలాంటి పోస్టులు పెట్టడం చాలా అరుదు. అయినా ఇప్పటికీ చాలామందికి వీరిద్దరు ఫేవరెట్ కపుల్. అందుకే వీరి యానివర్సరీకి ఒకరికొకరు క్యూట్‌గా విషెస్ చెప్పుకున్నారు.
'అప్పుడే 17 ఏళ్లు గడిచిపోయాయా అనిపిస్తుంది.. చాలా ఆశ్చర్యంగా ఉంది..' అంటూ తన ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మహేశ్ బాబు. కానీ నమ్రత మాత్రం వీరి పెళ్లి ఫోటోల దగ్గర నుండి ఇప్పటివరకు వీరి బెస్ట్ మూమెంట్స్‌ను ఓ వీడియోలాగా చేసి పోస్ట్ చేసింది. అంతే కాకుండా దానికి ఒక అందమైన క్యాప్షన్‌ను కూడా జతచేసింది.
'నా లిటిల్ మ్యారేజ్ రెసిపీ ఏంటంటే.. సంతోషం, నమ్మకం, గౌరవం, ఓర్పు అన్ని ప్రేమలో కలిపి జీవితాంతం ఉడికించాలి. ఎప్పటికప్పుడు దీని రుచి బెటర్‌గానే ఉంటుంది. హ్యాపీ 17. నా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను' అని పోస్ట్ చేసింది. నమ్రత. అంతే కాకుండా ఈ విషెస్ పోస్ట్‌లో మహేశ్, నమ్రత ఒకరిని ఒకరు ట్యాగ్ చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com