Namrata Shirodkar: ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు.. : నమ్రత

Namrata Shirodkar: ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు.. : నమ్రతఇంతకంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు.. : నమ్రతహీరోయిన్‌గా రాణిస్తున్నప్పుడే సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది నమ్రత. ఇద్దరు పిల్లల తల్లి కూడా అయిన ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.. పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను తన కుటుంబసభ్యులతో సెలబ్రేట్ చేసుకుంది నమ్రత. వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పిల్లలతో జాలీగా గడపడం కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అని రాసుకొచ్చింది.
మహేష్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా ఆటవిడుపుకోసం కుటుంబసభ్యులతో కలిసి టూర్స్ ప్లా్న్ చేస్తుంటాడు.. ఖాళీగా ఉంటే పిల్లలతో గడపడానికే ప్రాధాన్యత ఇస్తాడు. నమ్రత పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తూనే, మహేష్‌కి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలను కూడా చూసుకుంటోంది.
తన వ్యక్తిగత విషయాలతో పాటు మహేశ్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఇక మహేశ్ సర్కారు వారిపాట షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.. తన తదుపరి చిత్రం తివిక్రమ్‌తో ఉంటుందని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com