సినిమా

Akhanda : 'అఖండ' ప్రభంజనం.. 50 రోజుల్లో.. 200 కోట్లు..!

Akhanda : ఒకప్పుడు ధియేటర్ లలో సినిమాలు అంటే 50, 100 రోజులు ఆడేవి.. అప్పుడు అవే రికార్డు.. కానీ ఇప్పుడలా కాదు.

Akhanda : అఖండ ప్రభంజనం.. 50 రోజుల్లో.. 200 కోట్లు..!
X

Akhanda : ఒకప్పుడు ధియేటర్ లలో సినిమాలు అంటే 50, 100 రోజులు ఆడేవి.. అప్పుడు అవే రికార్డు.. కానీ ఇప్పుడలా కాదు... ఏ సినిమా కూడా రెండు వారాలకి మించి ఆడడం లేదు.. కానీ ఇప్పుడు కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటున్నారు. అలాంటి టైంలో ఓ సినిమా 50 రోజులు థియేటర్స్‌లో ఆడిదంటే మాములు విషయం కాదు.

ఈ ఘనతను బాలకృష్ణ అఖండ చిత్రం సృష్టించింది. బాలయ్య హీరోగా మాస్ హీరో బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ నిన్నటితో (జనవరి 19 బుధవారం) 50 రోజలు పూర్తి చేసుకుంది. సినిమాకి తొలి రోజు నుంచే మంచి పాజిటివ్‌ టాక్ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద అఖండ కాసుల వర్షం కురిపిస్తూ వచ్చింది.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 200 క్లబ్బులో ప్రవేశించినట్టుగా మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేశారు.మొత్తం ఈ సినిమా 103 థియేటర్స్‌లో 50 రోజులు ప్రదర్శితమైంది. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించగా, తమన్ సంగీతం అందించాడు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.


Next Story

RELATED STORIES