'అఖండ' టైటిల్ సాంగ్ ప్రోమో... బాలయ్య మాములుగా లేడుగా..

అఖండ టైటిల్ సాంగ్ ప్రోమో... బాలయ్య మాములుగా లేడుగా..
Akhanda Title Song : బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం 'అఖండ'.. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమా పైన అంచనాలను భారీగా పెంచేశాయి.

Akhanda Title Song : బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం 'అఖండ'.. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమా పైన అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా దీపావళి సందర్భంగా సినిమాకి సంబంధించిన టైటిల్ సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. భమ్.. అఖండ అంటూ సాగే ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో బాలయ్య కూడా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్ ని నవంబర్ 8న రిలీజ్ చేయనున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ, జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Tags

Next Story