Tollywood: అక్కినేనిపై బాలకృష్ణ కామెంట్స్.. అఖిల్, నాగ చైతన్య రియాక్షన్

Tollywood: అక్కినేనిపై బాలకృష్ణ కామెంట్స్.. అఖిల్, నాగ చైతన్య రియాక్షన్
Tollywood: తెలుగు సినిమాకు మూల స్ధంభాలు అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు.. తెలుగు సినిమా ఉన్నంతవరకు వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి.

Tollywood: తెలుగు సినిమాకు మూల స్ధంభాలు అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు.. తెలుగు సినిమా ఉన్నంతవరకు వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారిని గౌరవించడం అంటే తెలుగు సినిమా తనని తాను గౌరవించుకున్నట్లే. అంతటి లెజెండరీ యాక్టర్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసర పదాలు దొర్లితే ఆ తరువాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. తాజాగా బాలయ్య తాను నటించిన చిత్రం వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో అక్కినేని గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలవుతున్నారు.

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో నందమూరి బాలకృష్ణ ప్రసంగం వివాదాస్పదమైంది. ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావుల పట్ల అగౌరవంగా మాట్లాడినందుకు నటుడు విమర్శలను ఎదుర్కొంటున్నారు.

బాలకృష్ణ తమ తాత, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావును అగౌరవపరిచారంటూ నటులు నాగ చైతన్య, అఖిల్ అక్కినేని కలత చెందారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ..''మా నాన్నగారి సమకాలీనులు, ఆ రంగారావు (ఎస్వీ రంగారావును ఉద్దేశించి), అక్కినేని తొక్కినేని, మరికొందరు ఉన్నారు అని అన్నారు.

తమ తాత గురించి బాలకృష్ణ అగౌరవంగా మాట్లాడినందుకు నాగ చైతన్య, అఖిల్ విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా లెజెండరీ నటుడిని అగౌరవపరచడం తమను కించపరచడమేనని అన్నారు. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్‌వి రంగారావు గారు తెలుగు సినిమాకి గర్వకారణం అని, వారిని అగౌరవపరచడం మనల్ని మనం కించపరచుకున్నట్లేనని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఈ వివాదంపై నాగార్జున స్పందించలేదు.

బాలకృష్ణను అభిమానులు ట్రోల్ చేస్తున్నారు

బాలకృష్ణ అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్య నెటిజన్లకు మింగుడుపడలేదు. చాలా మంది అభిమానులు కూడా ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అతడిపై మీమ్స్ చేస్తున్నారు. కాగా, ఈ వివాదంపై బాలయ్య కూడా ఇంతవరకు వివరణ ఇచ్చుకోలేదు.

వీరసింహారెడ్డి గురించి

బాలక‌ృష్ణ నటించిన వీర సింహారెడ్డి సంక్రాంతికి సందడి చేసింది. ఈ చిత్రం కలక్షన్ల పరంగా విజయం సాధించింది. ఆదివారం, బృందం గ్రాండ్‌గా సక్సెస్ పార్టీని నిర్వహించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో శృతి హాసన్ కథానాయికగా నటించింది. కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక వరలక్ష్మి శరత్‌కుమార్ నటన చిత్రానికే హైలెట్‌గా నిలిచింది. హనీ రోజ్, లాల్, చంద్రిక రవి మరియు పి.రవిశంకర్ మరో ముఖ్య తారాగాణంగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు.

Tags

Read MoreRead Less
Next Story