Akhanda : అఖండ 50 రోజులు.. ఆ క్రేజీ రికార్డు బాలయ్య ఖాతాలో..!

Akhanda : అఖండ  50 రోజులు.. ఆ క్రేజీ రికార్డు బాలయ్య ఖాతాలో..!
Akhanda : నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ..

Akhanda : నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ.. హ్యాట్రిక్ మూవీగా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటితో యాబై రోజులు పూర్తి చేసుకుంది. దీనితో బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

50వ రోజు సెలబ్రేషన్స్ కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ దగ్గర భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. 50వ రోజు సెకండ్ షోకి బాలయ్య, బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పాల్గొనబోతున్నారు.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది.

ఏకంగా పది రోజుల్లోనే వంద కోట్లను కొల్లగొట్టింది. ఓ సినిమా థియేటర్లలలో యాబై రోజులు, వంద రోజులు ఆడడం అనేది ఎప్పుడో కనుమరుగైపోయింది. ఇప్పుడంతా కలెక్షన్ల గురించే డిస్కషన్.. అలాంటి టైంలో బాలయ్య అఖండ సినిమా ఏకంగా 24 థియేటర్లలో నేరుగా 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఇది బాలయ్య సినిమాకి దక్కడంతో నందమూరి అభిమానులు ఖుషి అవుతున్నారు. కాగా తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించాడు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.

Tags

Read MoreRead Less
Next Story