Balakrishna : ఇంట్రెస్టింగ్ : బాలయ్యతో శ్రీకాంత్ అడ్డాల.. ?

Balakrishna :  ఇంట్రెస్టింగ్ : బాలయ్యతో శ్రీకాంత్ అడ్డాల.. ?
Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి మార్క్ డైరెక్షన్‌‌కి డివోషన్ టచ్ తోడవ్వడంతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఏకంగా రూ. 200 కోట్ల వసూళ్ళు సాధించి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమా తరవాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్‌‌గా నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇందులో బాలయ్య త్రిబుల్ రోల్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఆ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన ఓ కథకి బాలకృష్ణ ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం.

ఇది పక్కా మాస్ మసాలా మూవీ అని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో వెలువడనున్నాయి. గతేడాది వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేష్‌‌ని పక్క మాస్ హీరోగా చూపించి సక్సెస్ అయ్యారు శ్రీకాంత్ అడ్డాల. మరి మాస్ హీరో అయిన బాలయ్యను ఆయన ఎలా చూపిస్తారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story