Nandamuri Balakrishna: రామానుజాచార్యుని పాత్రలో బాలయ్య.. వరుస ప్రాజెక్టులతో బిజీ

Nandamuri Balakrishna: రామానుజాచార్యుని పాత్రలో బాలయ్య.. వరుస ప్రాజెక్టులతో బిజీ
X
Nandamuri Balakrishna: కొన్ని పాత్రలు కొందరే చేయాలి. అవి వారు చేస్తేనే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఒకప్పుడు దేవుడు పాత్రలు అంటే ఎన్టీఆర్ మాత్రమే గుర్తొచ్చేవారు.

Nandamuri Balakrishna: కొన్ని పాత్రలు కొందరే చేయాలి. అవి వారు చేస్తేనే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఒకప్పుడు దేవుడు పాత్రలు అంటే ఎన్టీఆర్ మాత్రమే గుర్తొచ్చేవారు. భక్తుడు అనగానే అక్కినేని నాగేశ్వరరావు తర్వాతే ఎవరైనా అనుకున్నారు. ఈ తరంలో కూడా వారి వారసత్వం రూపంలో అదే కంటిన్యూ అవుతోంది. ఆ మధ్య రాముడుగా కనిపించాడు బాలకృష్ణ. నాగార్జున అన్నమయ్య, రామదాసులా తండ్రిని మరిపించాడు. ఇక ఇప్పుడు మరోసారి బాలయ్య దేవుడు అని చెప్పలేం కానీ.. దేవుడి మర్మాన్ని చెప్పిన ఓ గొప్ప వ్యక్తి పాత్రను చేయబోతున్నాడు అంటున్నారు. మరి పాత్రేంటీ.. ఎప్పుడు చేయబోతున్నాడు అనేది చూద్దాం..



తెలుగులో ఏ పాత్రైనా చేయగల అతికొద్ది మంది నటుల్లో బాలయ్య ముందు వరుసలో ఉంటారు. ఫిక్షన్ అయినా, ఫ్యాక్షన్ అయినా.. క్లాస్ అయినా మాస్ అయినా.. పాత్ర కోసం మారిపోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కొన్ని క్యారెక్టర్స్ అయితే మనసు పెట్టి చేస్తారు. పెద్దాయన ఎన్టీఆర్ లా నిబద్ధతతోనూ కనిపిస్తారు. శ్రీరామదాసు చేస్తున్నప్పుడు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు అలాంటి మరో పాత్ర ఆయన వద్దకు వచ్చింది. చాలాకాలంగా వినిపిస్తున్నదే అయినా.. మాగ్జిమం కన్ఫార్మ్ అయిందంటున్నారు.



ఇంతకీ ఈ పాత్రేంటో తెలుసా.. శ్రీ రామానుజాచార్య. రామానుజాచార్యులు విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. అలాంటి మహనీయుని పాత్రలో బాలయ్య నటించబోతున్నాడు. ప్రస్తుతం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదల కాబోతోంది. ఇక రీసెంట్ గానే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో 108వ సినిమా ప్రారంభం అయింది. సి కళ్యాణ్‌ నిర్మిస్తాడు అనే టాక్ వినిపిస్తోంది.




అయితే ఈ చిత్రాన్ని రీసెంట్ గా హైదరాబాద్ ముచ్చింతల్ లో రామానుజాచార్యుని అతి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్టించిన చినజీయర్ స్వామి గైడెన్స్ లో రూపొందిస్తారట. బాలయ్య 109వ ప్రాజెక్ట్ గా రాబోతోన్న ఈ రామానుజాచార్యుని కథ బాలయ్యకు ఖచ్చితంగా సూట్ అవుతుందనే చెప్పొచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే రాబోతున్నాయి.

Tags

Next Story