Veera Simha Reddy: 'వీరసింహరెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎట్టకేలకు సెట్టయ్యింది..
Veera Simha Reddy: జీవో నంబర్ 1 ఎఫెక్ట్‌తో ఏపీలోని పొలిటికల్ పార్టీలే.. కాదు.. సినీ ఇండస్ట్రీ ఇబ్బందులు పడుతోంది. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుమతుల కోసం తిరిగి తిరిగి విసుగు చెందిన శ్రేయాస్ మీడియా ప్రతినిధులు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. పది రోజుల తర్వాత కండీషన్స్ అప్లయ్ అంటూ పోలీసులు అనుమతివ్వడంతో.. సాయంత్రం వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు మూవీయూనిట్ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు త్రోవగుంటలోని బీఎంఆర్ అర్జున్స్ ఇన్‌ఫ్రా సంస్థ గ్రౌండ్ వేదికకాబోతోంది. ఏబీఎం కాలేజీ గ్రౌండ్‌లో ఈవెంట్ నిర్వహించనున్నట్టు మొదట చిత్ర బృందం ప్రకటించింది. ఈవెంట్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఆర్గనైజర్లు. అయితే.. హఠాత్తుగా పోలీసు అధికారులు అనుమతి నిరాకరించారు. ఊహించినదానికంటే అధిక సంఖ్యలో అభిమానులు తరలివస్తారని.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని.. అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని వేదిక మార్చుకోవాలని చిత్ర బృందానికి సూచించారు. దాంతో సెట్టింగ్స్ మొత్తం బుధవారం రాత్రి తొలగించాల్సి వచ్చింది.
ఏబీఎం కాలేజీ గ్రౌండ్‌లో అనుమతి నిరాకరించడంతో.. వీరసింహారెడ్డి టీమ్ రాత్రికి రాత్రే త్రోవగంట రోడ్డులో ఓ గ్రౌండ్‌ను సందర్శించింది. అక్కడ ఈవెంట్ నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరగా.. బీఎంఆర్ అర్జున్స్ ఇన్‌ఫ్రా సంస్థ స్థలంలో నిర్వహించేందుకు అంగీకరించారు. గురువారం రాత్రి వరకు ఆంక్షల పేరిట పోలీసులు ముప్పు తిప్పలు పెట్టారు. రాత్రి పది గంటల వరకూ పాసులు ఇవ్వలేదు.
వాటిపై స్టాంపింగ్ వేయాలంటూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందికి కొన్ని సూచనలిచ్చారు. బందోబస్తు విధుల్లో ఉన్నవారు తమ కుటుంబసభ్యులను తీసుకెళ్లవద్దని..ఎవరైనా అక్కడి ప్రముఖులతో ఫోటోలు దిగేందుకు తమ కార్యస్థలాలను విడిచి వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ, శృతి హసన్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొంటారు. రెండు గంటల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 45 నిమిషాల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com