Veera Simha Reddy Twitter Review: వీరసింహారెడ్డి.. మస్త్ మాస్ ఎంటర్‌టైనర్

Veera Simha Reddy Twitter Review: తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రం మాస్‌ని ఆకట్టుకుంది. గోపీచంద్ మలినేని రచన మరియు దర్శకత్వం వహించిన వీరసింహా రెడ్డి మాస్-యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. బాలకృష్ణతో శృతిహాసన్ కలిసి నటించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం.
"అపాయింట్‌మెంట్ లేకుండా వస్తే సందర్భాన్ని చూడను, లొకేషన్ చూడను... ఒంటి చేత్తో ఊచకోతా... కోస్తా నా కొడకా," అంటూ బాలకృష్ణ ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇస్తూ చెప్పిన డైలాగ్ థియేటర్‌లో దద్ధరిల్లింది. బాలకృష్ణపై అభిమానులు ప్రేమను కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఫుల్ ఎమోషనల్ అండ్ లవ్, ఆల్ టైమ్ రికార్డ్ #వీరసింహారెడ్డి.మరొకరు "#వీరసింహారెడ్డి పొంగల్‌కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఇరగదీశాడు అని మరొకరు రాసుకొచ్చారు. ఈ చిత్రంలో బలమైన భావోద్వేగాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
మలయాళ నటి హనీ రోజ్, చంద్రిక రవి, మురళీ శర్మ, నవీన్ చంద్ర ముఖ్యపాత్రలు పోషించగా, వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ ప్రతినాయకులుగా కనిపిస్తారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇక ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఖచ్చితంగా ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com