Nandamuri Balakrishna: బాలకృష్ణ జోష్‌ మామూలుగా లేదు.. విగ్ సెంటిమెంట్ రిపీట్..

Nandamuri Balakrishna: బాలకృష్ణ జోష్‌ మామూలుగా లేదు.. విగ్ సెంటిమెంట్ రిపీట్..
Nandamuri Balakrishna: అఖండ వంటి రోరింగ్ హిట్ తర్వాత బాలకృష్ణ జోష్‌ మామూలుగా లేదు. ఆహాలో అన్ స్టాపబుల్ తోనూ అదరగొడుతున్నాడు.

Nandamuri Balakrishna: అఖండ వంటి రోరింగ్ హిట్ తర్వాత బాలకృష్ణ జోష్‌ మామూలుగా లేదు. ఆహాలో అన్ స్టాపబుల్ తోనూ అదరగొడుతున్నాడు. ఇటు వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ స్టర్స్ కు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు బాలయ్య. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేసిన వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదల కాబోతోంది. నెక్ట్స్ అనిల్ రావిపూడితో సినిమామొదలైంది. అయితే ఈ సినిమా కూడా గ్యారెంటీ బ్లాక్ బస్టర్ అని ముందే ఫిక్స్ అయిపోవచ్చు.


రిజల్ట్స్ తో పనిలేకుండ రికార్డులు క్రియేట్ చేయగల హీరోల్లో బాలయ్య కూడా ఒకరు. ఆయన సినిమా అంటే అయితే హిట్ లేదంటే ఫట్. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేసిన అఖండ గతేడాది డిసెంబర్ 2న విడుదలై టైటిల్ కు తగ్గ విజయం అందుకుంది. తర్వాత క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా మొదలైంది. ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర్నుంచీ పాజిటివ్ గానే కనిపిస్తోంది. అందుకే ఈ సంక్రాంతి బరిలో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు. అది ఖచ్చితంగా జరుగుతుందీ..



అలాగే అనిల్ రావిపూడి సినిమా కూడా సూపర్ హిట్ అయి చాలా కాలం తర్వాత ఆయనకు హ్యాట్రిక్ అవుతుందీ అనుకోవచ్చు. అందుకు కారణం ఏంటంటే... బాలయ్య విగ్. యస్.. ఆయనకు విగ్ కరెక్ట్ గా సెట్ అయితే సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉంది. కొన్నాళ్లుగా ఆయన నటించిన సినిమాలు చూస్తే విగ్ చాలా బావుంటే సినిమా బ్లాక్ బస్టర్. అఖండలో రెండు పాత్రలకూ సెట్ అయింది. వీరసింహారెడ్డిలో కూడా విగ్ బాగా కుదిరింది.



ఇక అనిల్ రావిపూడితో మొదలైన సినిమా చూస్తే ఆయనకు విగ్ బలే కుదిరింది. సో.. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ ముందే ఫిక్స్ అయిపోవచ్చు. అంతే కాక మరో సెంటిమెంట్ కూడా కనిపిస్తోంద. అఖండ, వీర సింహారెడ్డితో పాటు అనిల్ సినిమాకూ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అతనికీ బాలయ్యతో ఇది హ్యాట్రిక్ మూవీ. అలా ఇద్దరూ కూడా వరుస విజయాలు అందుకోబోతున్నారు అనుకోవచ్చు. మొత్తంగా బాలయ్యకు బలమైన కథతో పాటు మంచి విగ్ కూడా సెట్ కావడం.. ఈ రెండు సినిమాలూ సూపర్ హిట్ అని ఫిక్స్ అయిపోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story