Akhanda Five days collections : బాక్సాఫీస్‌‌‌ను షేక్ చేస్తోన్న బాలయ్య

Akhanda Collection (tv5news.in)

Akhanda Collection (tv5news.in)

Akhanda : నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌‌‌లో వచ్చిన తాజా చిత్రం అఖండ.. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్ళతో దూసుకుపోతోంది

Akhanda : నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌‌‌లో వచ్చిన తాజా చిత్రం అఖండ.. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్ళతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి ఆట నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది ఈ చిత్రం.. ఇప్పటికే 2021లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా అఖండ చరిత్ర సృష్టించింది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. కేవలం అయిదు రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 80 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

సీడెడ్ : రూ. 10.72 కోట్లు

ఉత్తరాంద్ర : రూ. 4.12 కోట్లు

ఈస్ట్ : రూ. 2.8కోట్లు

వెస్ట్ : రూ. 2.22కోట్లు

గుంటూరు : రూ. .3.50కోట్లు

నెల్లూరు : రూ. 1.83కోట్లు

ఏపీ, తెలంగాణా టోటల్ కలెక్షన్స్ : 41.4 కోట్లు (రూ. 64.80కోట్ల గ్రాస్ )

టోటల్ వరల్డ్ వైడ్ 5 డేస్ కలెక్షన్లు రూ. 49.04 కోట్లు(80.30 కోట్లు గ్రాస్) వసూలు చేసింది.

ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న బాలయ్య తన తదుపరి చిత్రాన్ని మలినేని గోపీచంద్ తో చేస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి జై బాలయ్య అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story