Akhanda Collections : బాలయ్యా మజాకా.. 'అఖండ' 10రోజుల్లో 100 కోట్లు

Akhanda Collections : నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా జోరు మాములుగా లేదు... విడుదలైన ఫస్ట్ షో నుంచే సినిమాకి హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. రొటీన్ కథే అయినప్పటికీ బాలయ్యను బోయపాటి చూపించిన విధానం, తమన్ మ్యూజిక్ మాస్ ప్రేక్షకులకి బీభత్సంగా నచ్చేసింది.
దీనితో వసూళ్ళలో అఖండ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. కేవలం పదిరోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల మార్క్‌ని అందుకోవడం గమనార్హం. ఈ చిత్రం పది రోజుల్లో.. నైజాంలో రూ. 16.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.10 కోట్లు, గుంటూరులో రూ. 3.96 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.39 కోట్లు, కృష్ణాలో రూ. 2.99 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.80 కోట్లు, నెల్లూరులో రూ. 2.15 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది.
ఇక తెలుగులో రాష్ట్రాల్లో అయితే 49.34 కోట్లు షేర్ రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఇతర రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కలిపితే మొత్తంగా రూ. 9.35 కోట్లు రాబట్టింది. వీటన్నింటిని కలుపుకుంటే రూ. 58.74 కోట్లు షేర్ రాగా, రూ. 100 కోట్లు గ్రాస్‌ను దాటినట్లు చెబుతున్నారు. కాగా ఈ సినిమా రూ.53 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకొని బరిలోకి దిగి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com