Akhanda Trailer : 'నీ మాట శబ్దం.. నా మాట శాసనం'.. ట్రైలర్ అదుర్స్..!

Akhanda Trailer : నీ మాట శబ్దం.. నా మాట శాసనం.. ట్రైలర్ అదుర్స్..!
Akhanda Trailer : సింహ, లెజెండ్ లాంటి బ్లాక్‌‌బస్టర్ మూవీస్ తర్వాత హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ నుంచి వస్తోన్నచిత్రం అఖండ..

Akhanda Trailer : సింహ, లెజెండ్ లాంటి బ్లాక్‌‌బస్టర్ మూవీస్ తర్వాత హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ నుంచి వస్తోన్నచిత్రం అఖండ.. బాలయ్య అభిమానుల్లో ఈ సినిమా పైన భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌‌ని రిలీజ్ చేశారు మేకర్స్.. ట్రైలర్‌‌లో బాలకృష్ణ లుక్స్‌ అదిరిపోయాయి. ముఖ్యంగా అఘోరా లాంటి మాస్ లుక్‌‌తో సినిమాపైన అంచనాలను ఓ రేంజ్‌‌లో పెంచారు బాలయ్య... నీ మాట శబ్దం.. నా మాట శాసనం అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ అభిమానుల్లో జోష్‌‌ని పెంచేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌‌గా నటిస్తుండగా, జగపతిబాబు, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు ట్రైలర్ పైన మీరు కూడా ఓ లుక్కేయండి..!


Tags

Read MoreRead Less
Next Story