సినిమా

Rowdy Inspector : బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలయ్య 'రౌడీ ఇన్‌స్పెక్టర్'కి ముప్పై ఏళ్ళు...!

Rowdy Inspector : ముందుగా బొబ్బిలిసింహం అనే టైటిల్‌ని ఫిక్స్ చేసి ఆ టైటిల్ కి కథని ప్లాన్ చేశారు.. ఈ సమయంలో దర్శకుడు బి.గోపాల్ తమిళ్ చిత్రం చిన్నతంబి చూసి దానిని రీమేక్ చేద్దామని అనుకున్నారు

Rowdy Inspector : బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలయ్య  రౌడీ ఇన్‌స్పెక్టర్కి ముప్పై ఏళ్ళు...!
X

Rowdy Inspector : నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బి గోపాల్ కాంబినేషన్ ఉన్న క్రేజ్ వేరు. వీరి కాంబినేషన్‌‌లో ఇప్పటివరకు అయిదు సినిమాలు రాగా అందులో నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మొదటగా వీరి కాంబోలో వచ్చిన మూవీ 'లారీ డ్రైవర్'.. ఆ తర్వాత 'రౌడీ ఇన్‌‌స్పెక్టర్' తెరకెక్కింది. ఈ సినిమా 1992 మే 7న రిలీజై సరికొత్త రికార్డులను సృష్టించింది.. నేటితో ఈ చిత్రం ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. !

లారీడ్రైవర్ మూవీ తర్వాత బాలయ్య, గోపాల్ కాంబినేషన్‌‌లో ఓ సినిమాకి ప్లాన్ చేశారు నిర్మాత టి త్రివిక్రమరావు..

♦ ముందుగా బొబ్బిలిసింహం అనే టైటిల్‌ని ఫిక్స్ చేసి ఆ టైటిల్ కి కథని ప్లాన్ చేశారు.. ఈ సమయంలో దర్శకుడు బి.గోపాల్ తమిళ్ చిత్రం చిన్నతంబి చూసి దానిని రీమేక్ చేద్దామని అనుకున్నారు.. బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు..కానీ అప్పటికే కె.ఎస్.రామారావు ఆ సినిమా హక్కులు కొని, వెంకటేష్ హీరోగా చంటి పేరిట తీస్తున్నారని తెలిసింది.

♦ ఆ తర్వాత రకరకాల కథలు అనుకున్నారు కానీ ఏది ఫైనల్ కాలేదు.. చివరికి రచయిత పుష్పానంద్ ఓ కథతో ముందుకు వచ్చారు అదే రౌడీ ఇన్స్పెక్టర్.

♦ హీరోయిన్ గా విజయశాంతిని, మ్యూజిక్ డైరెక్టర్ గా బొప్పిలిహరి తీసుకున్నారు. బాలయ్య పుట్టినరోజున దర్శకుడు ఎ కోదండరామిరెడ్డి క్లాప్ తో రౌడీ ఇన్‌‌స్పెక్టర్ మొదలైంది.

♦ ఈ సినిమాకోసం బాలయ్య ఇంటినుంచి పొలీస్ డ్రెస్, పొలీస్ జీప్ లోనే షూటింగ్ కి వచ్చేవారట..

♦ ముందుగా సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ ఫైనల్ గా మేలో రిలీజ్ అయింది.. దాదాపు రెండున్నర కోట్లతో తెరకెక్కిన ఈ మూవీకి ఫస్ట్ డే నుంచి మంచి టాక్ వచ్చింది.

♦ రెండువారల్లోనే రెండు కోట్లు వసూళ్ళు చేయడం విశేషం. మొత్తం తొమ్మిది కోట్లు వసూళ్ళు చేసింది ఈ చిత్రం.

♦ అప్పట్లో 60 కేంద్రాలలో అర్ధశతదినోత్సవం.. 22 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.

♦ ఈ సినిమా తర్వాత డైలాగ్స్ అంటే బాలయ్య, బాలయ్య అంటేనే డైలాగ్స్ అన్నట్టుగా మారిపోయింది.

♦ ఈ చిత్రాన్ని హిందీలో ఇదే పేరుతో డబ్ చేయగా, తమిళంలో విజయశాంతికి ఉన్న క్రేజ్ దృష్ట్యా 'ఆటో రాణి'గా అనువదించారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ కావడం విశేషం.

♦ 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్ స్పెక్టర్' ఈ రెండు చిత్రాలలోనూ విజయశాంతి హీరోయిన్ కావడం మరో విశేషం..

♦ ఈ సినిమాకి ముందుగా అనుకున్న బొబ్బిలిసింహం టైటిల్ తోనే బాలయ్యతో మరో సినిమాని తెరకెక్కించారు నిర్మాత త్రివిక్రమరావు.. ఇంకో విశేషం ఏంటంటే.. రౌడీ ఇన్‌‌స్పెక్టర్ సినిమాకి క్లాప్ కొట్టిన కోదండరామిరెడ్డి ఈ సినిమాకి దర్శకుడు.

Next Story

RELATED STORIES