Nandamuri Mokshagna : నందమూరి అందగాడు.. క్లోజప్ తో కొట్టేశాడు

Nandamuri Mokshagna :  నందమూరి అందగాడు.. క్లోజప్ తో కొట్టేశాడు
X

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఫ్యాన్స్ లో ఓ కిక్ కనిపిస్తోంది. నందమూరి రెండో వారసుడుగా బాలయ్య ఉన్నాడు. మూడో తరం వారసుడుగా ఎన్టీఆర్ టాప్ రేంజ్ లో ఉన్నాడు. తరం మారినా.. ఎన్టీఆర్ సోదరుడుగా వస్తోన్న మోక్షజ్ఞ కోసం అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా హను మాన్ తో ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా లాంచ్ అవుతున్నాడు మోక్షజ్ఞ.

ఆ మధ్య మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అంతకు ముందు కాస్త చబ్బీగా కనిపించిన మోక్షు.. ఆ ఫోటోలో చాలా స్లిమ్ అయిపోయాడు. ఇక తాజాగా ప్రశాంత్ వర్మ మరో ‘క్లోజప్’ పోస్టర్ విడుదల చేశాడు. దీనికి యాక్షన్ కి సిద్ధమా అనే క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్టర్ లో మోక్షును చూసి చాలామంది ఫిదా అయిపోతున్నారు. తన ప్రీవియస్ లుక్స్ కంటే చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ పిక్ చూస్తుంటే మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు అంటున్నారు. అతని లుక్ చూస్తే రెండు జానర్స్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా కనిపిస్తున్నాడు. మొత్తంగా మోక్షజ్ఞ క్లోజప్ లుక్ తో అందరి మనసులు కొల్లగొట్టేశాడు.

Tags

Next Story