Jayamma Panchayathi : జయమ్మ కోసం ఇద్దరు స్టార్ హీరోలు..!

Jayamma Panchayathi : యాంకర్ సుమ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'జయమ్మ పంచాయతీ'. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకి విజయ్ దర్శకత్వం వహించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని మే 6న రిలీజ్ కాబోతోంది.
రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే రేపు (ఏప్రిల్ 30) ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో గ్రాండ్‌గా నిర్వహిస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి మొదలుకానున్న ఈ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ హీరోలైన నాగార్జున, నాని చీఫ్ గెస్ట్ లుగా రానున్నారు.
ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ సినిమా పైన మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.
Pre release event of #JayammaPanchayathi Tomorrow 6 PM on wards pic.twitter.com/AYeF3bS3aw
— T2BLive.COM (@T2BLive) April 29, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com