Nani Announced his next : నాని నుంచి మరో అనౌన్స్ మెంట్

నేచురల్ స్టార్ నాని దూకుడు గురించి అందరికీ తెలుసు. ఏడాదికి రెండు మూడు సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. కంటెంట్ పరంగానూ కొత్తగా ప్రయత్నిస్తున్నాడు. గత వారం సరిపోదా శనివారం మూవీతో వచ్చాడు నాని. వర్షాలు భారీగా కురుస్తున్నా.. ఈ మూవీ చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది. తాజాగా సక్సెస్ సంబరాలు కూడా చేసుకున్నారు. ఇంకా ఈ సినిమా గురించిన వార్తలు ఆగక ముందే ఆల్రెడీ తన బ్యానర్ లో కోర్ట్ అనే మూవీ ప్రారంభించాడు. దీంతో తను ముందు నుంచీ చెబుతున్నట్టుగా కెరీర్ లోనే అత్యంత వయెలెంట్ మూవీ ఓపెనింగ్ డేట్ కూడా చెప్పాడు.
దసరాతో తనలోని ఊరమాస్ యాక్టర్ ను చూపించాడు నాని. ఈ సినిమాలో తన నటనకు అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. స్టార్ హీరో అయి ఉండి ఇంత డీ గ్లామర్ రోల్ చేయడం నాని కమిట్మెంట్ కు నిదర్శనం. ఈ సినిమాతో చాలా అవార్డులు కూడా కొట్టారు. అందుకే అదే దర్శకుడ శ్రీకాంత్ ఓదెలకి మరో సినిమా ఇచ్చాడు నాని. ఈ సారి వయొలెన్స్ మరో స్థాయిలో ఉంటుందని రీసెంట్ గా నాని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎంతలా అంటే చిన్న పిల్లలు ఈ సినిమాకు రానివ్వొద్దు అని మూవీ స్టార్ట్ కాక ముందే చెప్పేంత అన్నాడు. మొత్తంగా ఈ చిత్రం ఈ బుధవారం అఫీషియల్ గా అనౌన్స్ కాబోతోంది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా విడుదల చేసి మరీ అనౌన్స్ చేశాడు నాని. ఆ పోస్టర్ లో ‘‘ హాఁ.. తో క్యా.. ’’ అనే మాట రాసి ఉంది. అంటే... ‘అవును.. అయితే ఏంటీ..’ అని అర్థం. సో.. ఆ మాటతో ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పాడు నాని. మరి ఇంత కాన్ఫిడెంట్ గా వయెలెంట్ మూవీ అంటున్నాడు.. పైగా దర్శకుడికి మరో అవకాశం వచ్చినా కాదని తనే రెండో అవకాశమూ ఇచ్చాడంటే ఈ సారి మాస్ తో డబుల్ డోస్ అనే అనుకోవచ్చా..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com