సినిమా

Nani: స్టార్ హీరోలందరూ ఎదురుచూసేది ఆమె డేట్ల కోసమే: నాని

Nani: నేచురల్ స్టార్ నాని అప్‌కమింగ్ పాన్ ఇండియా మూవీ ‘శ్యామ్ సింగరాయ్’.

Nani: స్టార్ హీరోలందరూ ఎదురుచూసేది ఆమె డేట్ల కోసమే: నాని
X

Nani: నేచురల్ స్టార్ నాని అప్‌కమింగ్ పాన్ ఇండియా మూవీ 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. ఇందులో నానికి జోడీగా కృతి శెట్టి, సాయి పల్లవి నటించారు. శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్‌లో ఘనంగా జరిగింది. సాయి పల్లవి, కృతి శెట్టి తమ గ్లామర్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే వారిని పక్కన పెట్టి మరీ నాని మరొకరిని ప్రశంసిస్తూ మాట్లాడాడు.

ఏ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగాలన్నా, ఏ రియాలిటీ షోలో అయినా ఫన్ రావాలన్నా యంకర్ సుమ ఉండాల్సందే. చాలాకాలం క్రితమే యాంకర్‌గా సెటిల్ అయిపోయిన సుమకు పోటీగా మరొక యాంకర్ బుల్లితెరపై అడుగుపెట్టలేదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో సుమ ఉంటే ఆ ఎనర్జీనే వేరు అని చాలామంది నమ్ముతారు. అదే మాట అన్నాడు హీరో నాని కూడా.

డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు హీరోల డేట్ల కోసం ఎదురుచూస్తారని, కానీ హీరోలంతా సుమ డేట్ల కోసం ఎదురుచూస్తారని అన్నాడు నాని. ఎవరైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా ముందుగా ఆమె డేట్లను చూసుకునే ప్లాన్ చేయాలన్నారు. ఇండస్ట్రీలో హీరోలందరూ ఎవరి డేట్ల కోసమయినా ఎదురుచూస్తున్నారంటే అది సుమ డేట్ల కోసమే అన్నారు. దీనికి సుమ థ్యాంక్స్ అంటూ బదులిచ్చింది.Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES