Nani Court : రిలీజ్ కు ముందే లాభాల్లోకి నాని కోర్ట్

నేచురల్ స్టార్ నాని తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పై నిర్మించిన సినిమాలు బాగా ఆకట్టుకుంటాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన కథలు ఎంచుకుంటాడు నాని. ప్రాపర్ ప్రమోషన్స్ చేస్తాడు. కొత్తవారిని ఎంకరేజ్ చేస్తున్నాడు. కొత్త కథలను పట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కోర్ట్ మూవీని తన బ్యానర్ లో నిర్మించాడు. స్టేట్ వర్సెస్ నో బడీ అనే క్యాప్షన్ తో రూపొందిన ఈ మూవీ ఈ శుక్రవారం థియేటర్స్ లో విడుదల కాబోతోంది.ఈ మూవీతో రామ్ జగదీష్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ రిలీజ్ కు ముందే లాభాల్లోకి వచ్చిందని చెబుతున్నారు.
కోర్ట్ మూవీ బడ్జెట్ కాస్త అటూ ఇటూగా 11 వరకూ అయ్యింది. అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే 9 కోట్లకు పైగా వసూలయ్యాయి.ఇక థియేట్రికల్ రన్ తో వచ్చేదంతా లాభాలే. పైగా ఈ బుధవారమే ప్రదర్శించిన ప్రీమియర్స్ కు మంచి స్పందన వచ్చింది. ఓ మంచి కోర్ట్ రూమ్ డ్రామా చూశాం అని చెబుతున్నారు చూసిన వాళ్లంతా. ఇది ఖచ్చితంగా సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. మరి ఈ ప్రీమియర్స్ తో పాటు మౌత్ టాక్ కూడా పెరిగితే కోర్ట్ మూవీని కొన్నవాళ్లంతా మంచి లాభాలే చూస్తారని చెప్పొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com