Ram Charan vs Nani : రామ్ చరణ్ తో పోటీకి సై అంటున్న నాని

నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విజయాలతో పాటు మాస్ ఇమేజ్ ను కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చివరగా వచ్చిన హిట్ 3 అతని కెరీర్ లోనే కాక టాలీవుడ్ లోనే మోస్ట్ వయొలెంట్ మూవీ అనిపించుకుంది. మరి ఈ కాన్ఫిడెన్స్ వల్లో లేక ఇంకేదో కారణమో కానీ.. అతను రామ్ చరణ్ తో పోటీకి సై అంటున్నాడు. అఫ్ కోర్స్ ఈ పోటీలో ముందుగా నిలబడింది నానినే. ఇంతకీ విషయం ఏంటంటే.. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ద ప్యారడైజ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన దసరా సూపర్ హిట్ అయింది. అందుకే ఈ ప్యారడైజ్ పై అంచనాలున్నాయి. జూన్ ఆరంభంలోనే చిత్రీకరణ మొదలవుతుందని చెప్పారు. కానీ కాస్త ఆలస్యం అయింది. ఈ మూవీ కోసం 1980ల కాలం నాటి హైదరాబాద్ లోని ప్యారడైజ్ పరసరాలు ప్రతిబింబించేలా ఓ భారీ సెట్ వేశారు. మెజారిటీ షూటింగ్ అక్కడే చేయబోతున్నారు. ఇక తాజాగా ఈ మూవీ సెట్స్ లోకి నాని అడుగుపెట్టాడు అనీ.. ద ప్యారడైజ్ షూటింగ్ స్టార్ట్ అయిందని తెలుపుతూ.. ఓ పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్ తో పాటు ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మూవీ ఓపెనింగ్ టైమ్ లోనే రిలీజ్ డేట్ కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత అదే టైమ్ కు రామ్ చరణ్ ‘పెద్ది’ని అనౌన్స్ చేశారు.
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందుతోన్న పెద్ద చిత్రాన్ని కూడా మార్చి 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఒక్క రోజే గ్యాప్ ఉన్నా.. పెద్దిపై ఇప్పటి నుంచే ఉన్న అంచనాలు చూస్తుంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నారు చాలామంది. ఇటు దసరా మూవీ నైజాంలో చేసినంత బాగా మిగతా ఏరియాస్ లో వసూళ్లు చేయలేదు. ఓ రకంగా శ్రీకాంత్ ఓదెల కంటే బుచ్చిబాబుకే ఎక్కువ స్పేస్ కనిపిస్తోంది. సో.. ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ ఉన్నా.. లాస్ కూడా ఎవరో ఒకరికి కనిపిస్తోంది. సో.. నాని కొంత గ్యాప్ తీసుకున్నా డేట్ మార్చేది లే అని ఫిక్స్ అయినట్టే కనిపిస్తోంది. మరి ఈ క్లాష్ చివరి వరకూ ఉంటుందా లేక మార్చి లో డేట్స్ మారతాయా అనేది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com