Nani - DSP : ముచ్చటగా మూడో సారి !

Nani - DSP : ముచ్చటగా మూడో సారి !
X

నేచురల్ స్టార్ నానీ ( Nani ) దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ( Srikanth Odela ) దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దసరా బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరూ కొలాబరేట్ అవుతుండడం ఆసక్తిగా మారింది. ఈ చిత్రం మాస్ ఎంటర్‌టైనర్ అని, నాని కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రమిదని అంటున్నారు. హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 200 రోజుల పాటు చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌తో సంగీతం అందించడానికి టీమ్ చర్చలు జరుపుతోందట. నేను లోకల్, యం.సీ.ఏ వంటి విజయవంతమైన చిత్రాలకు నాని, దేవీ కలిసి పనిచేశారు. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ మళ్ళీ కలవలేదు. ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోందని, త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్టు వినికిడి.

ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ నిర్మాతలు. నాని తన యూఎస్ఏ హాలిడే వెకేషన్ నుంచి తిరిగి వచ్చాడు. ఆగస్ట్ 29న విడుదల కానున్న తన లేటెస్ట్ చిత్రం సరిపోదా శనివారాన్ని ప్రమోట్ చేయనున్నాడు. త్వరలో హిట్ 3 సెట్స్‌లో జాయిన్ అవుతాడు. అలాగే.. ఈ సంవత్సరం శ్రీకాంత్ ఒదెల సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించనున్నాడు.

Tags

Next Story