Nani : ఆ బ్యూటీని ఆదుకుంటోన్న నాని
నేచురల్ స్టార్ నాని ఓ పెద్ద ప్రమాదంలోకి వెళుతున్నాడు. తన సొంత బ్యానర్ లోనే రూపొందుతోన్న ‘హిట్ థర్డ్ కేస్’ అనే టైటిల్ తో మరో సినిమా రూపొందిస్తున్నాడు. ఫస్ట్, సెకండ్ కేస్ లకు విశ్వక్ సేన్, అడవి శేష్ లను తీసుకున్న నాని ఈ సారి తనే రంగంలోకి దిగుతున్నాడు. ఇప్పటి వరకూ తన కెరీర్ లోనే లేనంత వయొలెన్స్ ఈ మూవీలో ఉంటుందని ఆ మధ్య చెప్పాడు. చిన్న పిల్లలు ఈ మూవీకి రావొద్దని కూడా అన్నాడు. లేటెస్ట్ గా వచ్చిన హిట్ మూవీ టీజర్ చూస్తే అది నిజమే అనేలా ఉంది.
శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ చూస్తే హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఒక బొలెరో వాహనం వేగంగా వస్తుంటుంది. అక్కడ బోర్డర్ లో కాపలా ఉన్న పోలీస్ కు ఫోన్ వస్తుంది. ఆ వాహనం మీ ఆఫీసరే నడుపుతున్నాడా అంటాడు. అవును అంటాడు సెంట్రీ. కానీ అతన్ని వెళ్లొద్దని చెప్పండి.. అతను చాలా ప్రమాదంలోకి వెళుతున్నాడు అంటాడు అవతలి వ్యక్తి. సరే అంటాను ఇతను. అతనికి అర్థం కాదు. అంటే దానర్థం ఏంటీ అని మళ్లీ అడుగుతాడు. దానికి ఆ సెంట్రీ.. ‘అంటే.. ఏ ఆఫీసర్ ని అయితే మీరు ప్రమాదంలోకి వెళుతున్నాడు అంటున్నారో.. అతనే ప్రమాదకారి..’ అంటాడు. నాని క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడానికి ఈ డైలాగ్ బాగా సెట్ అయింది. అందుకు తగ్గట్టుగానే కార్ లో రక్తంతో తడిచిన ఖాకీ చొక్కా తగిలించి ఉంది. డాష్ బోర్డ్ పై రక్తంతో ఉన్న గొడ్డలి కనిపిస్తోంది. చూస్తోంటే నాని తనకు సూట్ కాకపోయినా మరో మాస్ పాత్రలోకి వెళుతున్నట్టు కనిపిస్తోంది.
ఇక ఈ మూవీతో అందరూ ఐరన్ లెగ్ అని పక్కన బెట్టిన శ్రీ లీలకు అవకాశం ఇచ్చాడు నాని. శ్రీ లీలకు కొత్తగా ఒప్పుకున్న సినిమా అంటే ఇదే అని చెప్పాలి. ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికంటే ఇదే ముందు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక బాలీవుడ్ కు వెళుతుంది. టాలీవుడ్ లో పాగా వేయబోతోంది అనే వార్తలు వస్తోన్న టైమ్ లో నాని లాంటి స్టార్ తో ఆఫర్ అంటే అమ్మడికి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ మూవీ హిట్ అయితే పాప దశ తిరుగుతుంది. లేదంటే మరో ఫ్లాప్ అకౌంట్ లో పడుతుంది. బట్.. నాని కాన్ఫిడెన్స్ చూస్తుంటే శ్రీ లీలకు లైఫ్ ఇచ్చేలానే ఉన్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com